Hijra community fires on director shankar

director shankar news, shankar latest news, director shankar i movie, hijra community, hijra community director shankar news, i movie news, i movie collections, i movie photos

hijra community fires on director shankar : hijra communities is ready to attack on shankar house.

శంకర్’పై ధ్వజమెత్తిన హిజ్రాలు!

Posted: 01/18/2015 12:17 PM IST
Hijra community fires on director shankar

సోషల్-సైంటిఫిక్ చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న దర్శకుడు శంకర్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. నిజానికి.. శంకర్ ఎప్పుడూ తన సినిమాల లోకంలోనే వుంటాడు. ఒక్కసారి ఏదైనా ఓ చిత్రం షూటింగ్’ను ప్రారంభించాడంటే.. అది పూర్తయ్యేంతవరకు మీడియా ముందుకు కాదు కదా, తన సినిమాను ఎంతో రహస్యంగా తెరకెక్కించేస్తాడు. ఇక అతని మూవీ విడుదలైందంటే అప్పుడే మరో మూవీని రూపొందించే పనిలో బిజీ అయిపోతాడు. అంతే! ఏదైనా కాంట్రోవర్సీలు క్రియేట్ చేయడం, అందులో ఇరుక్కోవడం లాంటి సందర్భాలు ఇతని ఖాతాలో వుండవు. అటువంటి డైరెక్టర్ ఇప్పుడు అనుకోకుండా పెద్ద సమస్యల్లో చిక్కుకుపోయాడు.

చియాన్ విక్రమ్, అమీ జాక్సర్ జంటగా దర్శకుడు శంకర్ ‘ఐ’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే! ఫ్లాప్ టాక్’తో నడుస్తున్న ఈ చిత్రం కలెక్షన్లను బాగానే రాబడుతోంది. ఇదిలావుండగా.. ఈ చిత్రంలో శంకర్ ఓ విలన్ హిజ్రాపాత్ర కోసం నిజమైన హిజ్రా రాజాణితోనే నటింపచేశారు. ఈమె ప్రముఖ మోడల్ మాత్రమే కాకుండా ఐశ్వర్యరాయ్’తోబాటు ఇతర ప్రముఖ నటీమణులకు ఫ్యాషన్ డిజైనర్ కూడా! ‘ఐ’ చిత్రంలో ఈమె విక్రమ్’ను మోడల్’గా తీర్చిదిద్దే పాత్రలో నటించింది. ఆ పాత్రలో భాగంగానే ఆమె విక్రమ్ ప్రేమలో పడటం, హీరో ఆమెను అసహ్యించుకోవడం లాంటి సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. విక్రమ్’ను అంతం చేయాలన్న కసితో విలన్లతో కలిసి ఓ కుట్రలో పాలుపంచుకుంటుంది. ఇలా ఈమె నిడివి కూడా దాదాపు చాలాసేపటివరకే వుంది.

అయితే.. రాజాణి నటించిన సన్నివేశాలు ముఖ్యంగా హీరో ఆమెను అసహ్యించుకోవడం, అతన్ని అంతం చేయాలన్న కుట్రలో పాలుపంచుకోవడం లాంటివి సీన్లు తమను కించపరిచేవిగా, మనోభావాలను దెబ్బతీసేలా వున్నాయని హిజ్రా సంఘం తాజాగా ఓ ప్రకటనలో ఆరోపించింది. అంతేకాదు.. సంఘంలో తమను చిన్నచూపుతో చూడటంతోపాటు, సినిమాల్లోనూ చాలా అవమానకరంగా చిత్రీకరిస్తున్నారని ఆ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో దర్శకుడు శంకర్ వ్యవహరించిన తీరుపై ఇంటిని ముట్టడించి, ఆందోళన చేస్తామని హెచ్చరించింది కూడా! ఈ నేపథ్యంలోనే శంకర్ ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారని సమాచారం! ముందుముందు ఈ వ్యవహారం మరెంత వేడెక్కుతుందోనని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hijra community  director shankar  i movie news  

Other Articles