Mahesh babu koratala shiva movie song shooting

Mahesh Babu sreemanthudu movie, Mahesh Babu in Sreemanthudu movie photos, Mahesh babu wallpapers, Mahesh Babu latest updates, Sreemanthudu movie photos, Sreemanthudu updates, Sreemanthudu latest updates, Sreemanthudu movie wallpapers, tollywood updates, latest telugu movies, upcoming telugu movies

Mahesh Babu Koratala Shiva movie song shooting : Super Star Mahesh Babu started sreemanthudu shooting now dancing in title song. All Cast and Crew working for schedule to complete before sankranti. sreemanthudu movie will release for summer 2015

ఏం చేస్తున్నాడో ఏమిటో...?

Posted: 01/06/2015 08:37 AM IST
Mahesh babu koratala shiva movie song shooting

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ప్రిన్స్ చాలా కష్టపడుతున్నాడు. ‘ఆగడు’ పెద్ ఫ్లాపు కావటంతో.., ఈ సినిమాతో తానేంటే నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. డైలాగ్స్, బడ్జెట్, ఇతర విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. డాన్సులో కూడా కొత్త స్టెప్పులు నేర్చుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ మూవీలో మహేష్ టైటిల్ సాంగ్ షూట్ అవుతోందట. ఇందులో చాలా బాగా డాన్స్ చేస్తున్నాడని చెప్తున్నారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ పాటకు డాన్స్ నేర్పుతున్నాడు. న్యూ ఇయర్ కు దుబాయ్ కు వెళ్ళి వచ్చిన మహేష్, కొత్త ఉత్సాహంతో డాన్సులు చేస్తుండటంతో, ఫారిన్ టూర్ లో కొత్త మందు ఏం తీసుకున్నాడో అని అనుకుంటున్నారు. రామోజి ఫిలిం సిటీలో ఈ పాట షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మూవీ యూనిట్ సభ్యులు అంటున్నారు.

మహేష్ రోల్ చాలా డీసెంట్ గా ఉండటంతో పాటు హీరోయిజంను మరింతగా పెంచేలా ఉంటుందని చెప్తున్నారు. అందాల భామ శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 2014 సంవత్సరం ప్రిన్స్ రెండు సినిమాలు ప్లాపు కావటంతో ఈ ఏడాదైనా హిట్ వస్తుందా లేక ఫ్లాపుల ప్రిన్స్ గా కొనసాగుతాడా అని ఫ్యాన్స్ లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sreemanthudu movie  mahesh babu  tollywood updates  

Other Articles