Varun tej second movie producer allu aravind

Varun Tej movies, Varun Tej second movie, Varun Tej updates, Varun Tej second movie producer, Varun Tej second movie cast and crew, Varun Tej movie latest updates, Varun Tej wallpapers, tollywood latest, upcoming telugu movies, Varun Tej puri jagannath movie updates, Varun Tej Krish movie updates

Varun Tej second movie producer Allu Aravind : Geeta Arts Banner continues its legacy to produce second movie of mega heros. Varun Tej second movie will be produced by Allu Aravind but director has to be finalised whether puri jagannath or krish

వారసత్వం కొనసాగుతోంది...

Posted: 01/03/2015 12:54 PM IST
Varun tej second movie producer allu aravind

వరుణ్ తేజ్ రెండవ సినిమాపై నెలకొన్న సస్పెన్స్ కాస్త వీడింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరన్న విషయంపై రెండ్రోజులుగా జరుగుతున్న చర్చ ముగింపుకు వచ్చేసింది. రెండవ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానరే నిర్మిస్తుందని స్పష్టం అయింది. నువు చేస్తానంటే నేను కాదంటానా అన్నట్లుగా.., వరుణ్ తేజ్ రెండవ సినిమా తనకు ఇవ్వాలని అరవింద్ కోరటంతో నాగబాబు కాదనలేకపోయాడు. వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ మెగా హీరో రెండవ సినిమా కూడా అరవింద్ నిర్మించనున్నాడు.

మెగా ఫ్యామిలి నుంచి వచ్చిన రామ్ చరణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ రెండవ సినిమాలు తానే నిర్మించటంతో ఈ మూవీ కూడా తనకే ఇవ్వాలని మిగతా ప్రొడ్యూసర్ల కంటే అరవింద్ కాస్త గట్టిగానే ప్రయత్నించాడు. సెంటిమెంట్, రిలేషన్ వర్కవుట్ అయి సినిమాను తన ఖాతాలో వేసుకుని వెళ్ళాడు. ఈ సస్పెన్స్ వీడినా.., రెండవ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ‘ముకుంద’తో ఫ్యామిలీ హీరోగా అందరికి పరిచయం అయిన వరుణ్ తేజ్ తర్వాతి టార్గెట్ మాస్ అవుతుందా లేక.., క్లాస్, కమర్షియల్ ఎలిమెంట్ అవుతుందా తెలియటం లేదు.

నాగబాబు పక్కా ప్లాన్ ప్రకారం సెకండ్ ప్రాజెక్టును మాస్ ను టార్గెట్ చేసేలా పూరీతో సినిమాను ఓకే చేసుకున్నాడు. అయితే పూరీ డేట్ల అడ్జస్ట్ మెంట్ కాస్త ఇబ్బంది కావటం, ఇదే సమయంలో క్రిష్ ఖాళీగా ఉండటంతో ఏం చేస్తారో తెలియటం లేదు. దీనిపై సస్పెన్స్ కూడా త్వరలోనే వీడనుంది. తొలి సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా.., హీరోకు మంచి మార్కులు పడ్డాయి. అందువల్లే రెండవ సినిమాకు ఇంత కాంపిటిషన్ ఏర్పడింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Varun Tej  allu Aravind  Puri Jagannath  

Other Articles