Pataas movie audio release

Pataas Movie, Pataas Movie Audio release, Pataas Movie audio songs, Pataas Movie updates, Pataas Movie latest photos, Pataas Movie audio release highlights, Pataas Movie wallpapers, Kalyan Ram updates, Kalyan Ram movies

Pataas Movie Audio Release : Kalyan Ram Latest Movie Pataas audio released on january 1st 2015. NTR released pataas movie audio and wishes his brother movie will give big hit. raviteja, puri jagannath, ntr and many of tollywood personalities participated in Pataas Audio Release cermony

నందమూరి ఫ్యాన్స్ కు త్రిపుల్ థ్రిల్

Posted: 01/02/2015 08:37 AM IST
Pataas movie audio release

నందమూరి అభిమానులకు ఈ న్యూ ఇయర్ రోజున ఎప్పటికి గుర్తుండిపోతుంది. నట వారసులంతా ఫ్యాన్స్ కు వరుసపెట్టి కానుకలు ప్రకటించారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ తమ సినిమాల టీజర్లు విడుదల చేయగా.., కళ్యాణ్ రామ్ ఏకంగా ఆడియో రిలీజ్ చేశాడు. గురువారం సాయంత్రం ‘పటాస్’ ఆడియో విడుదల జరిగింది. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రవితేజ, పూరీ జగన్నాధ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నయ్య సినిమా ఆడియోను ఎన్టీఆర్ విడుదల చేశారు. కళ్యాణ్ రామ్, తాను ఒకే వేదికపై నిలబడి మాట్లాడాలి అనుకునే జానకీరామ్ కల నెరవేరిందన్నారు. ఇండస్ర్టీలో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉండాలని ఆకాంక్షించారు.

ఇక నందమూరి హీరో నిర్మిస్తున్న ‘కిక్2’లో నటిస్తున్న రవితేజ మాట్లాడుతూ.., పాటలు వింటుంటే సినిమా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాకు మంచి కళాకారులు పనిచేశారనీ.., కళ్యాణ్ కూడా బాగా కష్టపడ్డాడని చెప్పాడు. వారందరికీ మంచి ఫలితం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఇక తన సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కళ్యాణ్ రామ్ ధన్యవాదాలు తెలిపారు. సినిమా కోసం చాలా కష్టపడినట్లు వివరించాడు. ఆడియో విడుదలకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సొంతంగా నిర్మిస్తున్ ఈ సినిమాలో పోలిస్ ఆఫీసర్ గా కన్పించనున్నాడు. ‘పటాస్’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల అవుతుందని అంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శృతి సోది హీరోయిన్ గా నటిస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pataas Movie  Kalyan Ram  NTR  

Other Articles