Sridevi in mahesh babu movie

Sridevi, Mahesh Babu, Sridevi in Mahesh Babu Movie, Sridevi in Koratala Shiva Movie, Sridevi next movie, Sridevi latest movie update, Mahesh Babu Koratala Shiva movie, Mahesh Babu latest updates, Mahesh Babu Upcoming movies, Mahesh Babu sruti hassan photos, Srimanthudu Movie Updates, Srimanthudu cast and crew, Mahesh Babu latest photos, Mahesh Babu wallpapers, Sridevi Wallpapers, tollywood latest, telugu latest updates

Sridevi in Mahesh Babu Movie : latest gossip that Koratala Shiva plans to select Sridevi As mother-in-law for Mahesh Babu in his latest movie. Koratala Shiva discussing with Sridevi to act with Mahesh Babu. Mahesh Babu latest movie title not yet finalised but filmnagar talk that it may be Srimanthudu.

నాడు తండ్రికి వరసయింది.. ఇప్పుడు అబ్బాయికి అత్తవుతోంది..?

Posted: 12/29/2014 04:03 PM IST
Sridevi in mahesh babu movie

ఇండస్ర్టీలో ఎవరు ఎవరికి ఏమవుతారో చెప్పలేము. ఒక సినిమాలో చెల్లిగా నటించిన అమ్మాయి... మరో సినిమాలో సడన్ గా వదిన కావచ్చు..., ఇంకేమైనా అవ్వొచ్చు. జగమంత కుటుంబంలో ఎవరికీ ఎవరితోనూ శాశ్వత సంబంధాలు ఉండవు. ఆ సినిమా పూర్తయిందా.., వెంటనే మరో రిలేషన్ మొదలవుతుంది. అతిలోక సుందరి శ్రీదేవి.., ఒకప్పుడు తెలుగులో అందరు హీరోలతో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే అప్పటి అగ్రనటులందరితోనూ నటించంది. అప్పటి హీరోల రెండవ, మూడవ తరం తరాలు ఇండస్ర్టీని ఏలుతున్నాయి. అయినా సరే శ్రీదేవికి ఉండే క్రేజు మాత్ర తగ్గలేదు. ఇప్పటికీ సినిమాల్లో నటించమంటూ ఆఫర్లు వస్తున్నాయి.

ఫిలింనగర్ లో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టాక్ ప్రకారం.., అన్నీ కుదిరితే, అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చిందేసిన ఈమె.., అగ్రనటుడి తనయుడు మహేష్ తోనూ నటించనుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీలో ప్రిన్స్ కు అత్త క్యారెక్టర్ కావాల్సి వచ్చిందట. స్టార్ పక్కన స్టార్ నటి అయితేనే బాగుటుందని.., బోనీ కపూర్ భార్యను ఎంపిక చేశారని టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో మాత్రమే ఉండగా.., సుందరీమణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా శివబాబు కష్టపడుతున్నాడట.

ఇప్పటికే కొరటాల సినిమాపై చాలా పుకార్లు వచ్చాయి. సినిమా టైటిల్స్ పై, హీరోయిన్ వెళ్లిపోయిందనీ, మారిపోయిందనీ గుసగుసలు వచ్చాయి. లేటెస్ట్ గా జనవరి 1న ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. ఎప్పటికప్పుడు శివ ఈ రూమర్లను ఖండించుకుంటూ వస్తున్నారు. ‘కాస్త నేను చెప్పేదాకా ఆగండబ్బా.., ఏదయినా ఉంటే నేనే మీకు చెప్తా కదా’ అని డైరెక్టర్ అంటున్నాడు. ఫస్ట్ లుక్ ది బెస్ట్ లుక్ గా ఉండాలి అంటే కాస్త సమయం పడుతుంది అని చెప్పాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కానుంది. శృతి హాసన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Sridevi  Koratala shiva  

Other Articles