Ajith latest movie yennai arindhaal audio release date

yennai arindhaal audio release, yennai arindhaal audio release confirms, yennai arindhaal first look photos, yennai arindhaal teasers wallpapers, yennai arindhaal cast and crew, yennai arindhaal latest news updates, ajith movies latest updates, yennai arindhaal ajith photos, tollywood latest news updates

yennai arindhaal audio release date : tamil star hero ajith latest movie yennai arindhaal shooting going in telugu and tamil languages with three different roles. yennai arindhaal audio release date confirms ready to release on 31st december 2014 midnight

అర్ధరాత్రి అజిత్ మద్దెల దరువు

Posted: 12/26/2014 11:25 AM IST
Ajith latest movie yennai arindhaal audio release date

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘ఎన్నై అరిందాల్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ మద్య వచ్చిన ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. అదే విధంగా కొద్ది రోజుల క్రితం విడుదల అయిన ‘అద్దారు... అద్దారు’ అనే పాట కూడా పాపులర్ అయింది. సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావటంతో అభిమాలనుకు న్యూ ఇయర్ కానుకను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12గంటలకు ‘ఎన్నై అరిందాల్’ ఆడియో నేరుగా మార్కెట్ లోకి విడుదల కానుంది.

కొత్త సంవత్సర కానుకగా ఫ్యాన్స్ కోసం పాటలు అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. మూడు విభిన్నమైన పాత్రల్లో అజిత్ కన్పిస్తున్నాడు. యాక్షన్, స్టైల్, రొమాంటిక్ క్యారెక్టర్లలో నటిస్తున్న స్టార్ హీరో సరసన అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. అజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ కారణంగా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి హిట్ కొట్టడం ఖాయమని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే అజిత్ తీసింది తక్కువ సినిమాలే. అయినా సరే.. డిఫరెంటు కాన్సెప్టులతో ప్రయోగాత్మక సినిమాలు తీసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. యాక్షన్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. తెలుగులో కూడా అజిత్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీనికి తోడు ఆయనకున్న మంచి తనం కూడా అభిమానులను సంపాదించిపెట్టింది. సింప్లిసిటీ ఫాలో అయ్యే అజిత్.., ఇండస్ర్టీలో ఇతరులకు సాయం చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yennai arindhaal audio  ajith movie updates  tollywood latest  

Other Articles