Akhil debut movie heroine amyra dastur

akhil movie heroine, akhil first movie heroine, akhil debut movie latest updates, akkineni akhil first movie cast and crew, amyra dastur telugu movies, amyra dastur updates, akkineni naga chaitanya movie updates, vv vinayak movie updates tollywood latest news updates

akhil debut movie heroine Amyra Dastur : akkineni akhil debut movie unit almost stops search operation for heroine they found a beauty in bollywood amyra dastur finalised for akkineni nagarjuna younger son

చినబాబుకు చిన్నది దొరికేసినట్టే

Posted: 12/22/2014 01:12 PM IST
Akhil debut movie heroine amyra dastur

అక్కినేని ఫ్యామిలీ లేటెస్ట్ హీరో అఖిల్ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. గతవారమే పూజా పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. మూవీకి ప్రధాన లోటుగా ఉన్న హీరోయిన్ అంశం ఓ కొలిక్కివచ్చేనట్లే అని తెలుస్తోంది. అఖిల్ పక్కన నటించే అందాల భామ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టిన మూవీ యూనిట్ అన్ని ఇండస్ర్టీల్లో హీరోయిన్లను పరిశీలించింది. ముంబై మోడళ్లు మొదలుకుని ప్రతి ఒక్కరి ఆడిషన్ తీసుకున్నారు. చివరకు ఓ చక్కన్నమ్మను పట్టేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

బాలీవుడ్ హీరోయిన్ అమీర దస్తూర్ ను అఖిల్ సినిమా హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ‘ఇషక్’ అనే సినిమాతో ఇండస్ర్టీలోకి వచ్చిన ఈ అమ్మడు వయసులో చిన్నదైనా.., ఫ్యాన్స్ ను ఆకట్టుకోవటంలో మాత్రం పెద్దవారితో పోటి పడుతోంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు కే.వి.ఆనంద్ డైరెక్టర్ గా ఉన్నాడు. వయస్సు కూడా 21 సంవత్సరాలే కావటంతో అఖిల్ కు సరిజోడి అవుతుందని మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ అమ్మడి ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

వీ.వి. వినాయక్ డైరెక్షన్ లో రూపొందుతున్న అఖిల్ తొలి సినిమాను హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీతో నితిన్ నిర్మాతగా మారుతున్నాడు. హీరోగా నటించకముందే ‘మనం’ మూవీలో కన్పించి ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న అఖిల్ ఇండస్ర్టీలో అడుగు పెట్టకముందే తన క్రేజ్ తో రెండు యాడ్ లలో నటించాడు. హీరోయిన్ ఎంపిక కూడా పూర్తవటంతో జనవరిలో షూటింగ్ మొదలు పెట్టి.., వేసవికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని ఫిలింనగర్ లో టాక్ విన్పిస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhil debut updates  amyra dastur latest  vv vinayak movies  

Other Articles