Tamanna first look from baahubali

Tamanna, Tamannah, Tamanna latest news, Tamanna birthday news, Tamanna movies, Tamanna photos, Tamanna bahubali movie, Tamanna bahubali movie, Tamanna movie collections, Tamanna latest updates, Tamanna movie news, Tamanna cinema News, Tamanna upcomming movies, Tamanna new look, Tamanna first look

Tamanna leaves hers fans amazed in first look of her part in bahubali movie

బాహుబలిలో తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్..

Posted: 12/21/2014 01:42 PM IST
Tamanna first look from baahubali

దేవకన్యా, అప్పరస, అందాల బొమ్మ, అపరంజి బొమ్మ ఇలా ఏ పేరుతోనూ ఆ ముద్దుగుమ్మను పిలవడానికి సాహసించలేం. అలనాటి అతిలోక సుందరి శ్రీదేవినే మించిపోయిన అందం.. బహుచక్కని ఆహార్యం, అంతకు మించిన అకృతి, ఇలా ఎంత వర్ణించినా ఇంకా ఏదో వెలతి వుందనిపించే ముగ్దమనోహర రూపం ఆ పాలరాతి శిల్పానిది. అందులోనూ తన ప్రతిభతో మట్టిని కూడా మాణిక్యంలా మెరిపించే దర్శకుడి చేతిలో పడి.. నిగనిగలాడే శరీరకాంతితో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల అంతా కలసిన ఒక్కరిలా వచ్చిన శిల్పమే ఈ నటిశిరోమణి. అమె మిల్కీ బ్యూటీ తమన్నా..

పర్వత శ్రేణుల మధ్య నుంచి జాలువారుతున్న జలపాలాల మధ్య స్వర్ణం, శ్వేత వర్ణపు దుస్తులతో వజ్రంలా మెరిసిపోతున్న తమన్నా.. ఫస్ట్ లుక్ ఇవాళ అమె జన్మదినాన్ని పురస్కరించుకుని విడుదల చేశారు. సినిమా యూనిట్ విడుదల చేసిన అమె పస్ట్ లుక్ తో తన అభిమానులను మంత్రముగ్దుల్ని చేసిన తమన్నా.. వారిని రెప్పవాల్చకుండా అదేపనిగా చూసేలా చేసింది. బాహుహలి చిత్రంలో అవంతిక పాత్రలో నటిస్తోంది తమన్నా. ఈ భారి బడ్జెట్ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి స్వరకర్త. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. తమిళంలో ‘మహాబలి’గా ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు

ప్రస్తుతం బల్గేరియా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి షూటింగ్ చివరి అంకానికి చేరుకున్నట్లు సమాచారం. బాహుబలి చిత్రంలో నటిస్తున్న ప్రధాన తారాగణం అంతా బల్గేరియాలోనే మకాం వేశారు. దీంతో చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. బాహుబలి చిత్రం సమక్షంలోనే తమన్నా తన జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. టాలీవుడ్ జక్కన ఎస్ ఎస్ రాజమౌళి చేతుల మీదుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Tamannah  Bahubali  Tamanna latest updates  Tamanna birthday  

Other Articles