Shankar vikram i movie second tamil theatrical traielr censor talk

i movie second trailer, i movie second tamil trailer, i movie latest updates, i movie telugu trailer, i movie hindi trailer, i movie latest photos, vikram i movie photos, shankar next movie updates, tollywood latest news updates, i movie release date, i movie censor update

shankar vikram i movie second tamil theatrical traielr : i movie unit released i movie latest trailer in tamil version by aascars tv of youtube page. i second movie also gets same craze like first one in 11 hours nearly six lakhs people watched this video

మరోసారి కేకపుట్టించిన ‘ఐ’ క్లీన్ చిట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

Posted: 12/19/2014 10:13 AM IST
Shankar vikram i movie second tamil theatrical traielr censor talk

శంకర్ ది వండర్ క్రియేటర్ అని మరోసారి నిరూపితమైంది. తొలి ట్రైలర్ తో అందర్నీ ఆకట్టుకున్న ‘ఐ’ రెండవ ట్రైలర్ తో మరింతగా క్రేజు సంపాదించుకుంది. గురువారం రాత్రి విడుదల అయిన తమిళ్ వర్షన్ రెండవ ట్రైలర్ మతిపోగొడుతోంది. రెండు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఎక్కడా క్షణం పాటు కనురెప్ప ఆర్పనివ్వటం లేదని టాక్ విన్పిస్తోంది. అందుకే విడుదల అయిన పదకొండు గంటల్లోనే ట్రైలర్ ను చూసిన వారి సంఖ్య ఆరు లక్షలకు చేరువలో ఉంది. తొలి ట్రైలర్ తోనే సినిమా హాలీవుడ్ రేంజ్ ను దాటుతుందని చెప్పిన శంకర్ మాటలు ఈ ట్రైలర్ చూస్తే నమ్మక తప్పదు.

విక్రమ్, అమీజాక్సన్ లీడ్ క్యారెక్టర్లుగా రూపొందిన ‘ఐ’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్న మూవీకి బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఇందులో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని  స్పష్టం అవుతోంది. వివాదాల కంటే వింతలను చూపించటానికి ఇష్టపడే శంకర్.., ఈ ప్రాజెక్టుతో భారతీయులు కూడా హాలీవుడ్ సినిమాలు తీయగలరని నిరూపించటం ఖాయమన్పిస్తోంది. ఆస్కార్ బ్యానర్స్ పై 180 కోట్ల రూపాయలతో రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు దేశీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమాను డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

తెలుగులో ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై డబ్బింగ్ విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్. రెహ్మన్ అందించిన సంగీతానికి తమిళంలో మంచి స్పందన వచ్చింది. త్వరలోనే తెలుగు పాటలూ విడుదల కానున్నాయి. తెలుగు ఆడియో రిలీజ్ కు చాకీచాన్ హాజరుకానున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్న ‘ఐ’ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాము. కానీ ప్రస్తుతానికి ట్రైలర్ ను మీకోసం అందిస్తున్నాము.

సెన్సార్ పనులు కడూా


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie second trailer  vikram movie latest updates  tollywood latest  

Other Articles