Puri jagannath leaves temper movie shooting lefts bangkok

puri jagannath lefts bangkok, puri jagannath stops temper shooting, puri jagannath latest updates, puri jagannath ntr movie update, puri jagannath upcoming movie, temper movie latest updates, ntr temper movie stopped, temper movie shooting stops, temper not releases for sankranti, 2015 sankranti telugu movies, tollywood latest updates

puri jagannath leaves temper movie shooting lefts bangkok : Puri is enjoying in Bangkok without bothering about Temper shooting or its release. with latest news update temper not releasing for sankranti, puri jagannath enjoying in bangkok

‘టెంపర్’రాదని తెలిసి ఒంటరిగా ఇంటికెళ్ళిపోయాడు

Posted: 12/17/2014 08:28 AM IST
Puri jagannath leaves temper movie shooting lefts bangkok

మొదలు పెట్టాలనుకున్న సినిమా ఆగిపోతేనే లైట్ మెన్ కూడా చాలా బాధపడతాడు. అలాంటిది సినిమా 90శాతానికి పైగా పూర్తయి.. మరో నెల రోజల్లో విడుదల కావాల్సి ఉండగా ఆగిపోయిందంటే ఎలా ఉంటుంది. సినిమాను ప్రాణంగా ప్రేమించే డైరెక్టర్ కు అయితే కలిగే బాధను మాటల్లో చెప్పలేము. కాని మన పూరి భయ్యా ఇందుకు పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నాుడు. సినిమా ఆగిపోయిందని తెలియగానే ఎంత ఫీల్ అయ్యాడో తెలియదు కాని.., ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ లో కన్పించటం లేదు. కలల సౌధం కేవ్ లో కూడా అందుబాటులో లేడు. చివరకు సంగీత రాజు ‘చక్రి’ చనిపోతే కూడా చూడటానికి రాలేదు. ఎక్కడకు వెళ్లాడా అని ఆరాతీస్తే ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది.

పూరి జగన్నాధ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నాడని సన్నిహితులు చెప్తున్నారు. గతంలోనే బ్యాంకాక్ తనకు సొంతిల్లు.., భారత్ ఫారిన్ అని ప్రకటించాడు. అంటే సినిమా ఆగిపోవటంతో ఇంటికెళ్ళిపోయాడన్నమాట. అయితే ఇంటికి ఫ్యామిలితో కాకుండా.., సోలోగా వెళ్ళాడు.., దీని వెనక మతలబు ఏమిటో మనం ఖచ్చితంగా చెప్పలేము. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుగా.. సినిమా ఆగిపోయి ఫ్యాన్స్ బాధపడుతుంటే డైరెక్టర్ మాత్రం విహార యాత్రలు చేయటం ఏమిటో విడ్డూరంగా అని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.

పూరీ జగన్నాథ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘టెంపర్’ మూవీ సంక్రాంతికి విడుదల అవుతుందని భావించారు. అనుకోని పరిస్థితుల వల్ల సినిమా ఆగిపోయింది. దీంతో సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఇక ఫిబ్రవరి లో సినిమా విడుదలలు ఎక్కువగా ఉండవు. దీనికి తోడు ఈ నెల ఎన్టీఆర్ కు సెంటిమెంట్ పరంగా కూడా బిజినెస్ చేయదు. దీంతో ఇప్పటికిప్పుడు ఆగమేఘాల మీద షూటింగ్ పూర్తి చేసినా లాభం లేదని భావించి షూటింగ్ నిలిపేశారు. పిబ్రవరి చివర్లో లేదా మార్చిలో షూటింగ్ మొదలు పెట్టి వేసవికి ‘టెంపర్’ను సిద్ధం చేస్తారని టాక్ విన్పిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ‘బాద్ షా’ తర్వాత ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper movie updates  puri jagannath bangkok  ntr latest  

Other Articles