Dhanush raghuvaran b tech movie trailer

raghuvaran btech movie trailer, raghuvaran btech teasers photos, dhanush raghuvaran movie, raghuvaran btech movie latest updates, tamil dubbing telugu movies, latest telugu movie updates, dhanush movie updates

dhanush raghuvaran b.tech movie trailer : tamil star dhanush latest movie b.tech movie trailer released and getting good response from viewers, tamil vip dubbing movie raghuvaran b.tech trailer have a positive response from all sides

ఇది చాలు సినిమా గురించి చెప్పడానికి

Posted: 12/16/2014 01:27 PM IST
Dhanush raghuvaran b tech movie trailer

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వీఐపీ(వేలయిళ్ల పట్టతారి) సినిమా తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే ఆశలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ సోమవారం రాత్రి విడుదల అయింది. ఒక్కరోజులోనే  అనూహ్య స్పందన లభించింది. అన్ని వర్గాల నుంచి ట్రైలర్ బాగుందనే టాక్ వస్తోంది. ధనుష్ యాక్టింగ్ తో పాటు.., సినిమా టేకింగ్ కూడా చాలాబాగా వచ్చినట్లు స్పష్టమవుతోంది. దీంతో సినిమా హిట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. సినిమాకు తమిళంలో ఉన్న టాక్ కు కాస్త ప్రమోషన్ తోడయితే కమర్షియల్ హిట్ కావటం ఖాయంగా తెలుస్తోంది.

అమలాపాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని తెలుగులో స్రవంతి రవికిషోర్ విడుదల చేస్తున్నారు. గతంలో స్రవంతి బ్యానర్ పై పలు మంచి సినిమాలు నిర్మించారు. బీటెక్ పూర్తి చేసిన ఓ అబ్బాయి చేసిన మంచి పని కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను యూత్ ఎంటర్ టైనర్ అండ్ మెసేజ్ మూవీగా తెరకెక్కించారు. డిసెంబర్ లోపు డబ్బింగ్ సహా ఇతర పనులు పూర్తయితే చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. లేదంటే.., జనవరి మొదటి వారంలో, కుదరకపోతే సంక్రాంతి తర్వాత విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuvaran b.tech movie  dhanush updates  tamil dubbing movies  

Other Articles