Music director chakri last rites and condolance

chakri last rites, chakri death photos, chakri final rites updates, chakri death tollywood condolance, chakri movies songs, chakri latest updates, tollywood latest updates

music director chakri last rites and condolance : tollywood personalities pays tribute to music director chakri, chakri final rites completed between family members and fans condolance

ఇక సెలవు, పోయిరా నేస్తమా..

Posted: 12/15/2014 05:35 PM IST
Music director chakri last rites and condolance

గుండెపోటుతో లోకాన్ని విడిచి వెళ్లిన సంగీత దర్శకుడు చక్రధర్ (చక్రి)కి టాలీవుడ్ అశృనివాళి అర్పించింది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు వీడ్కోలు పలికారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను, తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అందర్నీ ఆదరించి ఉత్తమ సంగీతంను అందించారని కొనియాడారు. చక్రి చాలా మంచి మనిషని నటుడు బాలకృష్ణ కొనియాడారు.  తన సోదర సమానుడు అయిన చక్రికి తాను వీరాభిమానిని అని చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ.., నవ్విస్తూ ఉండే చక్రి మనమద్య లేకపోవటం బాధాకరమన్నారు.

అటు చక్రితో తనకు ఉన్న అనుబంధాన్ని అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ లో బెస్ట్ హిట్ ‘దేశముదురు’కు చక్రి సంగీతం అందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా పేర్కొన్నారు. ఇక నటుడు రవి తేజ చక్రి మరణంను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి పూరి, తనతో కలిసి సినిమాలు చేసి తమకు ఎన్నో హిట్లు అందించారని గుర్తు చేసుకున్నారు. తన తొలి సినిమా ‘రేయ్’కు అద్బుతమైన సంగీతం అందించిన చక్రి చనిపోవటం చాలా బాధాకరమని హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. చక్రి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు.

సహ సంగీత దర్శకుడు చక్రి మరణం తనను కలచివేసిందని సంగీత దర్శకుడు కోటి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ కలిసినా అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పలకరించేవాడని గుర్తు చేసుకున్నారు. ఇలా టాలీవుడ్ ప్రముఖులంతా చక్రితో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. అశృనయనాల మద్య సంగీత సామ్రాట్ కు తుది వీడ్కోలు పలికారు. టాలీవుడ్ సినిమా ప్రపంచంలో నేలరాలిన ఈ కుసుమం ఆత్మకు శాంతి చేకూరాలని ‘తెలుగు విశేష్ ప్రార్దిస్తోంది’.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chakri last rites  tollywood condolance  chakri death  

Other Articles