Sukumar kumari 21f movie shooting plan

kumari 21f movie shooting, kumari 21f movie updates, kumari 21f latest news updates, kumari 21f shooting, kumari 21f cast and crew, sukuamar movie updates, surya pratap movie updates, tollywood latest news updates

sukumar kumari 21f movie shooting plan : sukumar latest movie kumari 21f wraps for shooting for shooting schedule with full planned way. sukumar plans to complete kumari 21 f in 40 to 50 days

అమ్మాయి కోసం పక్కాగా స్కెచ్ గీస్తున్నాడు

Posted: 12/12/2014 11:22 AM IST
Sukumar kumari 21f movie shooting plan

డిఫరెంట్ యాంగిల్ తో సినిమాలు తీసే సుకుమార్ ఈ మద్య కాస్త దెబ్బతిన్నాడు మళ్ళీ డైరెక్టర్ గా తన అదృష్టం పరీక్షించుకునేందుకు త్వరలోనే ఓ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం మాత్రం ఈ డైరెక్టర్ ఓ పెళ్లి కాని అమ్మాయి కోసం ప్లాన్ గీస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో ‘కుమారి 21ఎఫ్’ తెరకెక్కనుంది. ఈ మూవీకి స్ర్కీన్ ప్లే, కథ అందిస్తున్న సుకుమార్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. షూటింగ్ ను వేగంగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 40నుంచి 50 రోజుల్లోనే షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

తక్కువ సమయంతో పాటు బడ్జెట్ కూడా తక్కువగా ఉండేలా పక్కా ప్లాన్ గీస్తున్నారు. ఎక్కడెక్కడ షూటింగ్ తీయాలి..., సీన్లు వివరణ, ఇతర అంశాలన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.  ఈ మూవీతో సుకుమార్ నిర్మాతగా మారుతున్నాడు. సినిమాలోని పెద్ద పెద్ద టెక్నీషియన్లు, కళాకారులు ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై, థామస్ రెడ్డి ఆదూరితో కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కథను కొత్తగా చూపించే సుకుమార్ ఇందులో ఏ మ్యాజిక్ చేస్తాడో త్వరలోనే తెలియనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kumari 21f shooting  sukumar movie updates  tollywood latest  

Other Articles