Rajinikanth lingaa movie release

lingaa release theatres, lingaa theatres list, lingaa movie review, lingaa telugu review, lingaa movie latest updates, rajinikanth on lingaa movie, lingaa movie court cases, lingaa latest updates, tollywood latest news updates, rajinikanth next movie updates, anushka upcoming movie updates

rajinikanth lingaa movie release : super star rajinikanth lingaa movie releases world wide on 12th november above 2300 theatres, rajini fans in lingaa fever with high expectations on the movie

రజినీ-రవి కాంబినేషన్ పైనే అందరి ఆశలు

Posted: 12/12/2014 08:28 AM IST
Rajinikanth lingaa movie release

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజినీకాంత్ అభిమానులు ‘లింగా’ఫీవర్ లో మునిగిపోయారు. ఇట్స్ టైం ఫర్ ‘లింగా’ అంటూ సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2400 థియేటర్లలో ఈ సినిమా ఇవాళ విడుదల అవుతోంది. ఓవర్ సీస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. తమిళనాడులో అయితే థియేటర్లు ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. వచ్చే వారం రోజుల వరకు కూడా ‘లింగా’ టికెట్స్ దొరకటం లేదని టాక్ విన్పిస్తోంది. తెలుగులో కూడా ఆలస్యంగా ప్రమోషన్ చేసినా.., రజినీ క్రేజ్ వల్ల సినిమా థియేటర్లు ఫుల్ అయ్యాయి.

రజినీ బర్త్ డే కానుకగా విడుదల అవుతున్న ‘లింగా’ సినిమా రికార్డులు తిరగరాస్తుందని మూవీ యూనిట్ తో పాటు., ఫ్యాన్స్ కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రజినీ డ్యూయల్ రోల్ వేరియేషన్ హైలైట్ అవుతుందని అంటున్నారు. ఆరు పదుల వయసులోనూ ఇద్దరు అందాల భామలతో సూపర్ స్టెప్పులు బాగా ఆకట్టుకుంటాయట. కోర్టు వివాదాలతో సినిమా విడుదలపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అయితే సెక్యురిటీ డిపాజిట్ కట్టించుకుని విడుదలకు అనుమతివ్వటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

రజినీ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమాలో సోనాక్ష సిన్హా పల్లెటూరి అమ్మాయిలా.., అనుష్క మోడ్రన్ గర్ల్ గా నటించింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా.., ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకటేష్ ఈ సినిమాను నిర్మించారు. రవికుమార్, రజినీ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ముత్తు, అరుణాచలం, నరసింహ సినిమాలు హిట్ కావటంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. వీరి కాంబినేషన్ పై నమ్మకంతోనే భారీ రేట్లు చెల్లించి సినిమా డిస్ర్టిబ్యూషన్లు తీసుకున్నట్లు పలువురు డిస్ర్టిబ్యూటర్లు చెప్పారు. ఇలా భారీ అంచనాలు, అనుమానాల మద్య విడుదల అయిన ‘లింగా’ ఎలా ఉందో కొద్ది సేపట్లో తేలిపోనుంది. సినిమా తెలుగు రివ్యూను ‘తెలుగు విశేష్’లో చూడండి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lingaa movie review  rajinikanth next movie  koliwood updates  

Other Articles