Akshara haasan debut shamitabh updates

akshara haasan debut, akshara haasan bollywood movies, akshara haasan shamitabh photos, akshara haasan latest updates, akshara haasan amitabh bachan photos, sruti haasan movies, tollywood latest news updates, bollywood latestupdates

Akshara Haasan debut shamitabh updates : kamal haasan second daughter akshara haasan gave entry with shamitabh movie, director Balki says akshara haasan made excellent performance in shamitabh movie

ముందుంది ముసళ్ళ పండగ

Posted: 12/11/2014 01:07 PM IST
Akshara haasan debut shamitabh updates

‘ఒక ఇంట్లో ముప్పై తలలుంటాయి కానీ.., మూడు జుట్లు ఉండలేవు’ అని సామెత ఉంది. త్వరలో కమల్ ఇంట్లో ఇదే జరగటం ఖాయంగా తెలుస్తోంది. విశ్వరూపుడి పెద్ద కూతురు సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగి టాప్ ప్లేస్ లో కూర్చుంది. ఇప్పుడు రెండవ కూతురు కూడా ఇండస్ర్టీ తెరంగేట్రం చేసింది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ‘షమితాబ్’ మూవీతో అమ్మడు వెండితెరకు పరిచయం అవుతోంది. చెల్లెలు సినిమాల్లోకి రావటంపై శృతి చాలా సంతోషంగా ఉంది. తన బాటలోనే టాప్ ప్లేస్ కు చేరుకోవాలని కోరుకుంటోంది. అయితే ఇప్పుడు బాగానే ఉన్నా.., ఇద్దరి మద్యా త్వరలో వివాదాలు రేగటం ఖాయమంటున్నారు బాలీవుడ్ పెద్దలు.

ఎందుకంటే తొలి సినిమాతోనే అక్షర కమల్ కూతురు అన్పించుకునేంతగా నటించిందట. అందం, అభినయం, ఆకర్షణ అన్ని కలగలిపితే అక్షర అని ‘షమితాబ్’ సినిమా యూనిట్ అంటోంది. ఇక డైరెక్టర్ బాల్కి అయితే.., తన సినిమాలో అమితాబ్, ధనుష్, అక్షర మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే అక్కి నట దిగ్గజాలకు సమానంగా ఉందన్నమాట. ఇది కేవల పొగడ్తా లేక వాస్తవమా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది కానీ.., ఇదే నిజమైతే మాత్రం ఇంటి పోరు తప్పదు. ఎందుకంటే శృతికి మంచి నటిగా ప్రూవ్ చేసుకోవటానికి చాలా సమయం పట్టగా, ఆమె చెల్లికి మాత్రం తొలి సినిమాతో ఈ చాన్స్ దక్కుతోంది. ఇలా అయితే భవిష్యత్తులో అక్క ఆఫర్లు కొట్టేసినా ఆశ్చర్యపోనవసరం లేదట. మరి ఈ సమస్యను వారెలా పరిష్కరించుకుంటారో చూడాలి.

ఆర్. బాల్కీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘షమితాబ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక అక్షర విషయానికి వస్తే.., సినిమాల్లోకి రాకముందే అమ్మడిపై చాలా పుకార్లు వచ్చాయి. ఓ సినీ ప్రముఖుడి మనవడితో ప్రేమాయణం నడుపుతుందని గుసగుసలు విన్పించాయి. ఆ తర్వాత రెండు ఫ్యామిలీల పెద్దలు కలిసి మాట్లాడుకుని వివాదంను పరిష్కరించుకున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshara haasan debut  shamitabh movie updates  bollywood movies  

Other Articles