Rajinkanth lingaa telugu audio release highlights

lingaa telugu audio songs, lingaa movie release date, lingaa movie telugu audio release photos, lingaa movie rajinikanth photos, lingaa movie cases, rajinikanth latest photos trailers, tollywood latest news updates

rajinkanth lingaa telugu audio release highlights : rajinikanth latest movie lingaa audio released on 08th december in hyderabad, rajinikanth says lingaa movie is of a big story, worked hard to complete movie

ఫైట్స్ మరొకరివి.. రొమాన్స్ నాది

Posted: 12/09/2014 08:59 AM IST
Rajinkanth lingaa telugu audio release highlights

‘లింగ’ కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. మరో మూడు రోజుల్లో థియేటర్లోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. తెలుగులో మిగిలి ఉన్న ఆడియో రిలీజ్ వేడుక కూడా సోమవారం సాయంత్రం ముగిసింది. హైదరాబాద్ లో జరిగిన ఆడియో రిలీజ్ వేడుకలో రజినీకాంత్, హీరోయిన్లు అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హాతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కె. విశ్వనాధ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రజినీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘లింగ’ సబ్జెక్ట్ చాలా పెద్దదిగా చెప్పారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానన్నారు. సినిమాలోని అన్ని స్టంట్లు సొంతంగా చేయకపోయినా.., హీరోయిన్లతో డాన్సులు మాత్రం తానే చేశానని చెప్పారు. సినిమా క్రెడిట్ అంతా కే.ఎస్. రవికుమార్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు దక్కుతుందని చెప్పారు. ఇక టాలీవుడ్ నిర్వహించిన ‘మేము సైతం’ను ప్రశంసించిన రజినీ.., కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు క్షమించాలని కోరారు. తెలుగులో రాజమౌళి గొప్ప డైరెక్టర్ అన్నారు. ‘బాహుబలి’ డేరింగ్ ప్రాజెక్టు అని చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ ప్రముఖులు కూడా రజినీని పొగడ్తలతో ముంచెత్తారు. తనకు బాలచందర్ వద్ద పనిచేయాలని, రజినీకాంత్ తో సినిమా తీయాలని రెండు కోరికలు ఉండేవని ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ అన్నారు. కాని తాను ఈ సినిమాలో రజినీకాంత్ తో నటించటం గొప్ప అనుభూతిగా తెలిపారు. ఇక రజినీ అభిమానులు పండగ చేసుకునే సమయం వచ్చిందని నటుడు జగపతిబాబు అన్నాడు. గతంలో ‘కథానాయకుడు’ సినిమాలో రజినీ పక్కన నటిస్తే.., మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం దక్కిందనీ ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సూపర్ స్టార్ ఆలోచనా విధానం చాలా పాజిటివ్ గా ఉంటుందని తెలిపారు.

ఆడియో రిలీజ్ లో పాల్గొన్న ఇతర నటులు, సినీ ప్రముఖులు కూడా రజినీకాంత్ ను పొగడ్తలతో ముంచెత్తారు. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా నాలుగు రోజుల ముందుగా తెలుగులో ఆడియో రిలీజ్ జరుపుకుంది. రజినీకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకటేష్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను కే.ఎస్. రవికుమార్ తెరకెక్కించారు. రజినీ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో సోనాక్షి సిన్హా పల్లెటూరి అమ్మాయిగా.. అనుష్క మోడ్రన్ భామగా అలరించనుంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lingaa movie telugu songs  rajinikanth speech  lingaa photos  

Other Articles