Pawan kalyan gopala gopala unique audio release update

gopala gopala audio release, gopala gopala songs videos, gopala gopala motion poster photos, gopala gopala first look trailers, gopala gopala latest news updates, gopala gopala release date, pawan kalyan gabbar singh2 updates, venkatesh next movie updates

pawan kalyan gopala gopala unique audio release update : pawan kalyan venkatesh multistarrer movie gopala gopala motion poster gets good response from that movie unit plans to release songs by a unique audio release programme

మరోసారి ట్రెండ్ సెట్ చేస్తాడట

Posted: 12/08/2014 09:08 AM IST
Pawan kalyan gopala gopala unique audio release update

పవర్ స్టార్ వన్ కళ్యాణ్ ఏది చేసినా ట్రెండ్ సెట్టింగ్ గానే ఉంటుంది. వాకింగ్, హెయిర్ స్టైల్,  డ్రెస్సింగ్  ఇలా ప్రతి ఒక్కటి పవన్ స్టైల్ అని చెప్పుకునేలా ట్రెండ్ మెయిన్ టైన్ చేస్తాడు. ఈ మద్య విడుదల అయిన ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా ట్రెండ్ సెట్టింగ్ గానే ఉంది. పవర్ స్టార్ కృష్ణుడిగా ఊయలలో పడుకుంటే.., వెనక వెంకటేష్ ఆయన పోజును కాపి కొట్టేందుకు ప్రయత్నిస్తూ ఫన్నీగా అన్పిస్తుంది. ఇక మోషన్ పోస్టర్ లోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇప్పటికే యూత్ మొబైల్ రింగ్ టోన్ గా మారింది.

ఇదే ఇన్ స్పిరేషన్ తో ఆడియో రిలీజ్ కూడా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. స్టేజి అప్పియరెన్స్, ఆడియో రిలీజ్ వేడుక కొత్తగా ఉండేట్లు ప్లాన్ చేస్తున్నారని సమాచారం వస్తోంది. అందరికి గుర్తుండిపోయేలా ఈ ప్రోగ్రాంను రూపొందిస్తున్నారట. ఈ నెలలో విడుదల అయ్యే ఆడియో రిలీజ్ కోసం ముందస్తు ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ముగియటంతో ఇక ఆడియో రిలీజ్ పైనే మూవీ యూనిట్ దృష్టి పెట్టింది.

రొటీన్ కు భిన్నంగా పవన్ ను వెరైటీగా.., ట్రెండీ ఐకాన్ గా చూపించే డైరెక్టర్లు.., ఈ ఆడియో రిలీజ్ ను ఎలా ప్లాన్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి బేస్ అయిన ‘ఓ మై గాడ్’ను బట్టి చూస్తే.., ‘గోపాల గోపాల’లో పవన్ ఉండే సమయం తక్కువైనా ప్రజల్లో క్రేజు వల్ల ప్రమోషన్ పవన్ పేరుపైనే జరుగుతోంది. నిర్మాత కూడా పవన్ పేరును వాడుకుని ప్రమోషన్ పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala audio  pawan kalyan first look  venkatesh movies  tollywood updates  

Other Articles