Andhra film workers attarcted kcr rachakonda telangana film city

telangana film city, kcr telangana film city, rachakonda film city, telangana pharma city, andhra people on telangana film city, telangana film board members, telangana film persons, kcr on telangana film city, tollywood going vizag, chandrababu on tollywood to vizag, tollywood latest news updates

andhra film workers attarcted kcr rachakonda telangana film city : kcr all set to start a film city for telangana in rachakonda area telangana film personalities plans to play lead role but interestingly andhra people also wants to join in telangana industry

తెలంగాణ ఫిలిం సిటీలో.., ఆంధ్రా కళాకారుల వలస..?

Posted: 12/04/2014 05:33 PM IST
Andhra film workers attarcted kcr rachakonda telangana film city

తెలుగు రాష్ర్టాలు రెండుగా విడిపోయిన నేపథ్యంలో.., తెలంగాణను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి కొన్ని పనులు చేసుకుంటూ పోతున్నాడు. వీటితో పాటు తన మదిలో మెదిలే ఆలోచనలకు కూడా కార్యరూపం దాల్చుకుంటూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. తాజాగా ఫార్మాసిటీ పనులు మొదలు పెట్టిన సీఎం సారు.., ఇప్పుడు ఫిలిం సిటీపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ లో టాలీవుడ్ పేరుతో పరిశ్రమ ఉన్నప్పటికీ అందులో ఎక్కువశాతం ఆంధ్రా ప్రాంత కళాకారులే ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. స్థానికతకు ఎక్కువ ప్రాధన్యమిచ్చ చంద్రశేఖరుడు.., తెలంగాణకు కూడా ఒక ఇండస్ర్టీ ఉండాలి అనుకున్నారు. రాచకొండ సమీపంలో మంచి ప్లేస్ చూసేందుకు హెలికాప్టర్ ను సిద్ధంగా ఉంచాలని పైలట్ కు ముందే చెప్పాడట.

రాష్ర్ట విభజన జరిగినా ఇండస్ర్టీ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటుందని టాలీవుడ్ ప్రకటించింది. అటు తెలంగాణ సర్కారు కూడా కళాకారులను కడుపులో దాచుకుంటాం.., కష్టం రానివ్వము అని చెప్పింది. కాని ఇప్పుడు మా ఇండస్ర్టీ.., మా సినిమా అంటూ కొత్తగా సిని నగరాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని వెనక ఉన్న అసలు గుట్టు ఏమిటో ఇప్పుడే చెప్పలేము కానీ.., ఈ పరిశ్రమలో చోటు దక్కించుకోవాలని తెలంగాణ వారి కంటే ఆంధ్రా వ్యక్తులే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండస్ర్టీలో ఉన్న 24 విభాగాల్లో కలిపి వేల మంది కళాకారులు ఉన్నారు. ఇక రిజిస్టర్ కానివారు చాలామంది ఉన్నారు. విభజన తర్వాత నిర్మాతల మండలి సహా ఇతర విభాగాలు రెండుగా విభజించబడ్డాయి. ఏపీ కి చెందిన సంఘాల్లో లేని కళాకారులు తెలంగాణ సంఘాల్లో చేరేందుకు తెగ ఆరాట పడుతున్నారట. ఎందుకంటే.., తెలంగాణ సంఘంలో ఉన్నవారికే తొలి ప్రాధాన్యం లభించనుంది. దీంతో ‘‘గానమా.., నా ప్రాణమా’’ అంటూ ఆంధ్రా బిడ్డలు తెలంగాణ పాట పాడుతున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన కళాకారులు తెలంగాణ సంఘాల్లో చేరటానికి ఆసక్తి చూపించటం వెనక చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది వీరంతా హైదరాబాద్ లోనే ఉండాలి అనుకుంటున్నారు. టాలీవుడ్ పొరపాటున విశాఖకు వెళ్తే అక్కడ జీవన ప్రమాణ రేటుకు వీరు బ్రతకటం కష్టమవుతుంది. కాబట్టి చౌకగా ఉండే హైదరాబాద్ అయితే బెస్ట్ చాయిస్ అని మెంబర్ షిప్ కోసం మోజు పడుతున్నారు. దీనికి తోడు కేసీఆర్ హామిల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. హెల్త్ కార్డులు, ఇళ్ళ స్థలాలు అంటూ వరుసగా ఆఫర్లు ప్రకటించి ‘అయ్యా మీరు దేవుడు’ అన్పించుకునే రకం. ఇండస్ర్టీ ప్రారంభించే సమయంలో కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం ఉండటంతో ప్లాట్ల కోసం కూడా సభ్యత్వ పాట్లు పడుతున్నారు.

కేసీఆర్ ఆలోచనతో రాచకొండ దశ తిరగనుంది. రాళ్ల దిబ్బగా ఉన్న ఒకప్పటి ఫిలింనగర్.., ఇప్పుడెలా ఉందో... రాచకొండ కూడా సమీప భవిష్యత్తులో అంతకు రెట్టింపుగా అభివృద్ధి చెందనుంది. ఇండస్ర్టీ రావటం.., సినిమాలకు ప్రోత్సాహాలు ఇవ్వటం అంతా బాగానే ఉంది కానీ.., ఈ ఆంధ్రావారి చేరిక గురించి సీఎంకు ఎంతవరకు అవగాహన ఉందనేది చెప్పలేము. స్థానికతకు తెగ ప్రాధాన్యత ఇచ్చే సారు.., తెలంగాణ ఫిలిం సిటీలో ఏపీ కళాకారులను ఉండనిస్తారా.., మరేం చేస్తారన్నది భవిష్యత్తులో తేలనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  film city  kcr  andhra  tollywood  

Other Articles