Naga shaurya movie lakshmi rave maa intiki censor

laxmi raave maa intiki censor board, laxmi raave maa intiki release date, laxmi raave maa intiki latest news updates, laxmi raave maa intiki trailer teaser, laxmi raave maa intiki photos, avika gor in laxmi raave maa intiki, laxmi raave maa intiki naga shourya photos, naga shourya next movie updates, laxmi raave maa intiki review, tollywood latest news updates

naga shaurya movie lakshmi rave maa intiki censor : tollywood small movies latest hero naga shourya laxmi raave maa intiki all set to release on december 5th, this movie completed censor work and got clean certificate

ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే హ్యాట్రిక్ హిట్టే

Posted: 12/02/2014 01:03 PM IST
Naga shaurya movie lakshmi rave maa intiki censor

ధనాధన్ మంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న యంగ్ హీరో నాగశౌర్య మరో మూవీని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యాడు. ‘లక్ష్మి రావే మా ఇంటికి’ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. అందరూ చూడదగ్గ సినిమగా బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. డిసెంబర్ 5న భారీ అంచనాల మద్య థియేటర్లలోకి వస్తోంది. గతంలో రెండు వరస హిట్లు రావటంతో మూడవ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.

‘లక్ష్మి రావే మా ఇంటికి’ మూవీకి ముందు వచ్చిన ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘ఊహలు గుసగుసలాడె’ సినిమాలకు మంచి స్పందన వచ్చింది. ఈ రెండు సినిమాల్లో ఒకదానికి యు/ఎ సర్టిఫికెట్ రాగా.., మరొక మూవీకి యు సర్టిఫికెట్ వచ్చింది. ఇప్పుడు కూడా యు/ఎ రావటంతో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని చిన్నసినిమాల అభిమానులు భావిస్తున్నారు. సినిమా పాటలతో పాటు, ఈ మద్య వచ్చిన ట్రైలర్లకు మంచి స్పందన రావటంతో సినిమా హిట్ సాధిస్తుందని అంటున్నారు.

‘ఉయ్యాల జంపాల’ ఫేం అవికా గోర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో మాటల రచయిత నంద్యాల రవి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. గిరిధర్ ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్ పై గిరిధర్ మామిడిపల్లి మూవీని నిర్మిస్తుండగా, కే.ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : laxmi raave maa intiki  censor  naga shourya  avika gor  

Other Articles