Balakrishna sings song and draws attention of audience at memu saitam programme

tollywood, hudhud cyclone, balakrishna, balaiah sings, legend song, draws attention, audience, memu saitam, balakrishna new angle, singer balakrishna, movie news, tollywood news

balakrishna sings song and draws attention of audience at memu saitam programme

పాట ఆలపించి శ్రోతలను అలరించిన బాలయ్య

Posted: 11/30/2014 07:07 PM IST
Balakrishna sings song and draws attention of audience at memu saitam programme

నందమూరి నట వారసుడు బాలకృష్ణ తనలోని మరో కోత్త కోణాన్ని చూసే అవకాశం ఇన్నాళ్లకు దక్కింది తెలుగు ప్రేక్షకులకు. పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో హీరోయిజం ప్రదర్శించడంలో బాలకృష్ణ తనకు తానే సాటి. ఫ్యాక్షన్ అయినా యాక్షన్ అయినా బాలయ్య స్టైలే వేరు. చాలామంది తెలుగు హీరోలు సరదాగా తమ సినిమాల్లో పాటలు పాడినా.. బాలయ్య ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేయలేదు. బాలకృష్ణ పాటపాడితే ఎలా ఉంటుంది? అదీ స్టూడియాలో కాకుండా నేరుగా స్టేజ్ ష్లో పాడితే..! అభిమానులు ఇప్పటి వరకు చూడని ఈ సన్నివేశం ఇవాళ ఆవిష్కృతమైంది.

హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమంలో బాలయ్య గాయకుడి అవతారం ఎత్తారు. గాయని కౌసల్యతో కలసి  పాటపాడి హుషారెత్తించారు. బాలకృష్ణ ఏమాత్రం బెరుకు లేకుండా ప్రొఫెషనల్ సింగర్లా పాట పాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్ర పరిశ్రమ ప్రముఖులు కేకలు, విజిల్స్ వేసి బాలకృష్ణను ఉత్సాహ పరిచారు. పాట పాడినా.. డైలాగ్ చెప్పినా.. నీకు నీవే సాటి అంటూ బాలయ్య అభిమానులు సంబరంలో మునిగి తేలుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles