Renu desai comments on pawan kalyan venkatesh gopala gopala first look

renu desai comments, renu desai comments on gopala gopala movie first look, renu desai latest comments on pawan kalyan, pawan kalyan first look in gopala gopala, venkatesh pawan kalyan in gopala gopala first look photo, gopala gopala first look motion poster teaser trailer, gopala gopala latest photos, gopala gopala cast and crew, tollywood latest news updates

renu desai comments on pawan kalyan venkatesh gopala gopala first look : producer and heroine renu desai responds on pawan kalyan first look of gopala gopala moive, renu desai says gopala gopala first look poster looks like a suitable photo for a suitable person

పవన్ ఫస్ట్ లుక్ పై రేణు కామెంట్

Posted: 11/29/2014 08:30 AM IST
Renu desai comments on pawan kalyan venkatesh gopala gopala first look

కాస్త గ్యాపు దొరికితే చాలు పవన్ పై కామెంట్లు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఐకాన్ గా ఉండే రేణు దేశాయ్ మరోసారి ఆయనపై స్పందించింది. తాజాగా విడుదల అయిన ‘గోపాల గోపాల’  ఫస్ట్ లుక్ పై కామెంట్ చేసింది. మోషన్ పోస్టర్ చూసిన రేణు.., ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ చూశాను. సరైన వ్యక్తికి సరైన పోస్టర్ గా ఇది ఉంది. ఆయన మాత్రమే అంత నిర్మలంగా, దైవత్వంతో కన్పించగలడు’ అంటూ పవన్ ను పొగడ్తలతో ముంచెత్తింది.

పవన్ పేరు ఎత్తితే పొగడ్తలు మొదలు  పెట్టే రేణు దేశాయ్ పోస్టర్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఈ పోస్టర్ పై చాలామంది  పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. పోస్టర్ విడుదల కాకముందే చూసిన టాలీవుడ్ ప్రముఖులు కొందరు..., సూపర్బ్ లుక్ అని ప్రశంసించారు. అన్నట్లుగానే పోస్టర్ చాల  బాగుంది. ఆన్ లైన్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మోషన్ పోస్టర్ శుక్రవారం సాయంత్రం విడుదల కాగా అర్ధరాత్రి లోపు నాలుగు లక్షల మందికి పైగా చూశారు. దీన్నిబట్టే ఫ్యాన్స్ లో ‘గోపాల గోపాల’సినిమాపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది.

గోపాలుడు సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో.. తాజా రెస్పాన్స్ చూస్తే మిగతా సినిమాల గుండెల్లో గుబులు పుట్టడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్  చివరిదశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్ళనుంది. డిసెంబర్ లో సినిమా ఆడియో విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, కిశోర్ డాలి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కృష్ణుడి వేషంలో కన్పిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : renu desai  venkatesh  pawan kalyan  gopala gopala first look  tollywood  

Other Articles