Ntr temper movie first look photos

temper first look photos, junior ntr temper movie first look photos, junior ntr temper latest photos, temper movie ntr kajal latest photos, temper latest updates, ntr movie updates, kajal next movie name and updates, puri jagannath movie updates, tollywood latest news updates

ntr temper movie first look photos : junior ntr latest movei temper released hero's first look photos, in one of two photos ntr looks serious in police duty but with out police dress, in an other poster beach scene without shirt show his fit body to audience

ఎన్టీఆర్ ‘టెంపర్’ ఫస్ట్ లుక్ ఫొటోలు

Posted: 11/27/2014 04:39 PM IST
Ntr temper movie first look photos

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ సంక్రాంతి మరింత సంతోషం తేవటం ఖాయమన్పిస్తోంది. జూనియర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా ఫస్ట్ లుక్ ఫొటోలు చూస్తేనే స్పష్టమవుతోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఫొటోలు ఎన్టీఆర్ లో కొత్త మ్యానరిజంను చూపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ లోని రెండు ఫొటోల్లొ తొలి పోస్టర్ తారక్ లోని పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ ను చూపిస్తోంది. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ తో పాటు ముఖంలోని సీరియస్ యాంగిల్ ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ను అందిస్తుదంని తెలుస్తోంది.

ntr-temper1

ఇక సెకండ్ ఫొటో చూస్తే., గోవా బీచ్ లో షూట్ చేసిన సన్నివేశాలకు సంబంధించిన ఫొటో. ఎన్టీఆర్ కొత్తగా బిల్డప్ చేసిన బాడీని చూపిస్తున్న పోస్టర్ తారక్ లోని కొత్త లుక్ ను ప్రజెంట్ చేస్తోంది. గతంలో వచ్చిన సినిమాల్లో బొద్దుగా, కొన్ని సినిమాల్లో చిక్కిపోయి కన్పించగా ‘టెంపర్’ లో మాత్రం ఫుల్ షేప్ బిల్డ్ అయిన బాడీతో కొత్త లుక్ లో కన్పిస్తున్నాడు. ఈ ఫొటోలు చూస్తేనే సినిమా పూరీ మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్ అవుతుందని స్పష్టంగా తెలిసిపోతుంది. పరమేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ‘టెంపర్’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.

ntr-temper2
కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : temper first look  ntr  temper movie  kajal  puri jagannath  

Other Articles