Pranitha hits the jackpot to play as heroin in mass

heroin, pranitha, tamil hero, surya, jackpot, film news, movie news, kollywood

pranitha hits the jackpot, to play as heroin in mass

అజాను జరపి జాక్ పాట్ కోట్టేసిన బాపుబొమ్మ

Posted: 11/26/2014 09:06 AM IST
Pranitha hits the jackpot to play as heroin in mass

అత్తారింటికి దారేది చిత్రంతో నటించి మెప్పించిన బాపు బొమ్మ ప్రణీతకు మళ్లీ అలాంటి బంపర్ ఆపర్ యే వరించింది. పవన్ కళ్యాన్ చిత్రంలో నటించి, పదహారు అణాల తెలుగింటి ఆడపడచులా, అలరించి, మెప్పించిన ఈ బామ.. ఆంధ్రప్రదేశ్ లో యువత మనస్సులను దోచుకుంది. అయితే ఈ అమ్మడుకు ప్రస్తుతం చేతిలో ఆఫర్లు కరువయ్యాయి. పవన్ ఎంపిక చేసుకునే నాటికి బావ సినిమాలో హీరో సిద్ధార్థ్ తో నటించినా.. ఆ చిత్రం ప్లాప్ కావడంతో.. అనకున్న అవకాశాలు లేక.. ఒక్క ఛాన్స్ అంటూ వేచి చూసింది. దీంతో పవన్ కళ్యాన్ అమెకు అత్తారింటికి దారేది సినిమాలో ఛాన్స్ కల్పించడంతో.. వరుస సినిమాల్లో నటించి మెప్పించింది.

కాగా, తాజాగా ఆమె నటించిన ఆఖరి చిత్రం ‘రభస’ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ అవకాశాల కోసం వేచిచూస్తోందట. మళ్లీ ఒక్క ఛాన్స్ అంటూ వేచి చూస్తున్న అమ్మడుకు తమిళ హీరో సూర్య అవకాశం కల్పించాడట. ఛాన్స్ ఇస్తే చాలంటున్న ఈ భామ పరిస్థితి ఇప్పుడు రొట్టె విరిగి నేతిలో పడినట్టు అయ్యంది. సూర్య సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కోట్టేసింది ఈ అందాల బొమ్మ. అనుకోని కారణాల వలన సూర్య ‘మాస్’ చిత్రం నుండి అమీ జాక్సన్ ని తప్పించి ఆ స్థానం ప్రణీతకు తీసుకున్నారు. మాస్ సినిమాను గతంలో కార్తీతో బిర్యాని తీసిన వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సూర్య ఈ సినిమాలో నయనతార, ప్రణీతలతో జతకట్టనున్నాడు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నాడు
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heroin  pranitha  tamil hero  surya  jackpot  film news  movie news  kollywood  

Other Articles