Daggubati rana weekend parties samantha trisha tollywood talk show

daggubati rana, daggubati rana latest news, samantha latest news, anchor pradeep news, actress trisha news, tollywood news, konchem touch lo unte cheptanu, telugu news

daggubati rana weekend parties samantha trisha tollywood talk show

సమంతతో కలిసి వీకెండ్ పంచుకోవాలనుందట!

Posted: 11/24/2014 12:31 PM IST
Daggubati rana weekend parties samantha trisha tollywood talk show

టాలీవుడ్ కండలవీరుడిగా పేరుగాంచిన రానా.. తన మనసులోని మాటను చివరికి బహిర్గతం చేశాడు. మొన్నటివరకు త్రిషతో క్లోజ్’గా మూవ్ అయిన ఇతగాడు.. ఇప్పుడు సమంతపై మనసు పారేసుకున్నాడని ప్రచారాలు కొనసాగుతున్నాయి. పైగా ఆమెతో కలిసి వీకెండ్’లో ఎంజాయ్ చేసుకోవాలనుందని రానా స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో.. ఆ మాటలు టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచిపోయాయి. రానా ఇప్పుడు సమంత మాయలో పూర్తిగా మునిగిపోయాడని, ఆమెతో లోలోపలే ప్రేమాయణం నడుపుతున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు.

ఓ టీవీ ఛానెల్’లో ప్రసారమవుతున్న టాక్ షోలో పాల్గొన్న రానా.. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. త్రిషకు, తనకు వున్న సంబంధం గురించి ఏమీ మాట్లాడని రానా.. సమంతతో కలిసి ప్రతీ వీకెండ్’లో పార్టీ చేసుకోవాలనుందని, ఆమెతో సరదాగా ఎంజాయ్ చేయాలనుందని పేర్కొనడం విశేషంగా మారింది. ఇప్పటికే రానా తన గాళ్ ఫ్రెండ్స్ జాబితాలో చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించగా.. తాజాగా సమంత పేరును కూడా అందులోకి చేర్చాలేమో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై సమంత ఎలా రిప్లై ఇస్తుందో తెలీదుకానీ.. రానా మాత్రం సరదా కోసం ఆ మాటలు అన్నట్లు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daggubati rana  samantha  trisha krishna  konchem touch lo unte cheptanu  telugu news  

Other Articles