Rakul preet singh shahrukh khan simla mirchi bollywood movie ramesh sippy

rakul preet singh, shahrukh khan, shahrukh khan latest news, shahrukh khan movies, shahrukh khan fan movie, shahrukh khan biography, shahrukh khan history, shahrukh khan history, shahrukh khan gossips, rakul preet singh hot photos, rakul preet singh shahrukh khan, simla mirchi movie, ramesh sippy

rakul preet singh shahrukh khan simla mirchi bollywood movie ramesh sippy

తొలిసారి ఆ హీరోతో కల నిజం చేసుకుందట!

Posted: 11/22/2014 07:40 PM IST
Rakul preet singh shahrukh khan simla mirchi bollywood movie ramesh sippy

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్.. చాలారోజుల తర్వాత ఆ హీరోతో తన కలను నిజం చేసుకున్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. దాంతో తన జీవితమే ధన్యమైపోయిందని చెప్పుకుంటోంది అమ్మడు. ఇక విషయానికి వస్తే.. రకుల్’కి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. ఆయనను ఎప్పుడైనా ఒకసారి కలుసుకోవాలనే ఆశ ఈ అమ్మడికి వుండేదట! అయితే అనుకోకుండా ఆయనతో కలవడంతో అమ్మడు ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే.. ఆయనే రకుల్ సెట్లోకి వచ్చాడు. దాంతో తెగ మురిసిపోతోంది ఈ పంజాబీ భామ!

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో రమేష్ సిప్పీ నిర్మిస్తున్న ‘సిమ్లా మిర్చి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబయ్’లోని మహబూబ్ స్టూడియోలో జరుగుతున్న సమయంలో షారుఖ్, రమేష్ సిప్పీని కలవడానికి వచ్చాడు. రమేష్ తో షారుఖ్ కు వున్న సన్నిహిత కారణంగానే ఆయన కలవడానికి వచ్చారు. దీంతో అక్కడే వున్న రకుల్ ప్రీత్.. తన అభిమాన నటుడు ఇలా ఒక్కసారిగా ప్రత్యక్ష్యం అయ్యేసరికి ఆనందమయంలో మునిగిపోయిందట! తదేకంగా కళ్ళు అప్పగించి షారుఖ్ ను చూస్తూ ఉండిపోయిందట అమ్మడు. తర్వాత కొద్దిసేపటివరకు షారుఖ్ తో మాట్లాడానని చెబుతోంది రకుల్!

‘‘నేను చిన్నప్పటినుంచి షారుఖ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు వీరాభిమానిని. అలాంటిది ఆయనను తొలిసారిగా కలవడం కల నిజమైనట్టుగా అనిపిస్తోంది. ఆయన మాతో కొద్దిసేపటివరకు ముచ్చటించారు. ఆ సమయంలో తన కొత్త సినిమాకు సంబంధించి కబుర్లు చెప్పారు. ఒక స్టార్ హీరో అనే గర్వం అతనిలో కనపడలేదు. నిజంగా ఆయనను కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది’’ అని అమ్మడు తన సంతోషాన్ని పంచుకుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh  shahrukh khan  silma mirchi movie  ramesh sippy  telugu news  

Other Articles