Malli malli idi raani roju movie update

malli malli idi raani roju latest update, malli malli idi raani roju movie cast and crew, malli malli idi raani roju shooting photos, malli malli idi raani roju release date, malli malli idi raani roju songs and photos, tollywood latest movies, malli malli idi raani roju censor, nithya menon in malli malli idi raani roju movie, sarvanand in malli malli idi raani roju

malli malli idi raani roju movie update : tollywood latest classical looking movie malli malli idi raani roju had completed shooting part successfully. malli malli idi raani roju movie directed by kranti madhav in vallabha production here is movie cast and crew says that this will rock telugu audience

మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు

Posted: 11/21/2014 04:31 PM IST
Malli malli idi raani roju movie update

టాలీవుడ్ లో త్వరలో మరో ఫీల్ గుడ్ సినిమా రాబోతుంది. నలబై సంవత్సరాలకు పైబడి సిని నిర్మాణ చరిత్ర ఉన్న క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా షూటింగ్ పూర్తయింది. పాండిచ్చేరిలో చివరగా మూవీ షెడ్యూల్ లోని పాటను షూట్ చేయటంతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయిందని మూవీ యూనిట్ తెలిపింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.

ఈ మూవీపై మీడియాతో మాట్లాడిన సినిమా సమర్పకుడు రామారావు... క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో వస్తున్న మరో మంచి లవ్ స్టోరీయే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అని తెలిపారు. సరికొత్త కధతో పాటు, యూత్ ను అట్రాక్ట్ చేసే డిఫరెంట్ సినిమాగా నిలిచిపోతుందన్నారు. శర్వానంద్ - నిత్యామీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ సీన్లు రియాలిటీకి దగ్గరగా చాలా న్యాచురల్ గా వచ్చాయని చెప్పారు. తమ బ్యానర్ పేరు నిలబెట్టడంతో పాటు ఇండస్ర్టీలో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది అని అంతా అనుకునేలా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఉంటుందని రామారావు పేర్కొన్నారు.

క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కె.ఎ. వల్లభ నిర్మాతగా వ్యవహరించారు. ఇక మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సినిమాలో ఇతర సాంకేతిక వర్గం విషయానికి వస్తే... సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, మాటలు : సాయి మాధవ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malli malli idi raani roju  shooting  nithya menon  tollywood  sarvanand  

Other Articles