Kajal agarwal takes a selfie with salman khan in flight

kajal with salman khan, kajal photo with salman khan, kajal aggrawal hot photo with puri jagannath, kajal ntr movie update, kajal movie latest update, kajal next movie update, ntr temper movie updates, tollywood latest news update

kajal agarwal takes a selfie with salman khan in flight : tollywood star heroine kajal is fan of salman khan un expectedly she salman in flight journey immediately she talk with hero and takes a snap photo

కండల మద్యలో చేరి కచక్ మన్పించుకుంది

Posted: 11/20/2014 03:18 PM IST
Kajal agarwal takes a selfie with salman khan in flight

టాలీవుడ్ గ్లామరస్ గర్ల్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా షూటింగ్ బిజీలో ఉంది. గోవాలో జరుగుతన్న షూటింగ్ లో అమ్మడు గ్లామర్ డోస్ పెంచి మరి నటిస్తోందని తెలుస్తోంది. దీంతో అభిమానులకు అందాల విందు ఖాయంగా తెలుస్తోంది. ఇక తాజా వార్త ఏమిటంటే ఈ అమ్మడు ఈ మద్య సల్లూభాయ్ ను తెగ ఇబ్బంది పెట్టిందట. డార్లింగ్ సినిమాలో సార్.. సార్... సార్ అని వెంట పడినట్లుగా నిజంగానే హీరోగారి వెంట పడిందట. కాజల్ తాకిడికి సల్మాన్ జిమ్ కండలు సైతం కరిగిపోయినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఈ మద్య ముంబై నుంచి కాజల్ హైదరాబాద్ కు వచ్చింది. ఇదే విమానంలో సల్మాన్ కూడా హైదరాబాద్ కు వస్తున్నాడు. విమానంలో సల్మాన్ ను చూసిన కాజల్ సంతోషం పట్టలేకపోయింది. సల్లూ, మేరా.... అంటూ లోలోపల ఏదో అనేసుకుని మొత్తానికి సల్మాన్ పక్కన చేరింది. మీరు చాలా బాగుంటారు, అంటూ కండల వంక అదోలా చూస్తూ కామెంట్ చేసింది. సరే అని హీరో సైలెంట్ గా ఉన్నా వదల్లేదు. ఏదో ఒకటి మాట్లాడేస్తూ విమాన ప్రయాణం అంటే విరక్తి పుట్టేలా చేసింది. ఇలా తగులుకుందేంటి అనుకున్నా వదలదే.

చివరకు సల్లూతో సొల్లు అంతా మాట్లాడిన తర్వాత తీపి గుర్తుగా ఓ ఫొటో దిగుతానని అడిగింది. కాదనలేక పోయిన కండలవీరుడు కాజల్ తో క్లిక్ కు సిద్ధపడ్డాడు. దొరికిందే చాన్స్ అన్నట్లుగా బాడీ బిల్డర్ కండల మద్యలో చేరిపోయి కచక్ మన్పించుకుంది. ఇంతలోనే హైదరాబాద్ రావటంతో థ్యాంక్స్ దేవుడా అనుకుంటూ సల్మాన్ విమానం దిగిపోయాడు. ఇక ఈ జర్నీ ఓ మధురానుభూతి అంటూ మీడియా ముందుకొచ్చి అర్పితా ఖాన్ అన్నయ్యను మునగచెట్టు ఎక్కించేసింది. ఇంతా చేసినా పెళ్ళికి మాత్రం వెళ్లలేదు. ఖాళీ లేకనా.. లేక సల్లూ ఆహ్వానం లేకనా అనేది మాత్రం తెలియదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal  salman  photos  flight  tollywood  

Other Articles