Trisha condemns engagement rumors

trisha engagement, trisha engaged with varun manian, varun manian radiance realty and media, filmmaker varnu manian with trisha, trisha rana affair break up, trisha rana love latest update, trisha next movie, trisha latest news, trisha experimental movies, trisha latest photos, koliwood latest news updates, tollywood latest news updates

trisha condemns engagement rumors : Celestial beauty Trisha has squashed her engagement rumours. finally trisha condemns and refutes about her engagement with filmmaker, Radiance realty and media proprietor Varun Manian, says she will first tell media if she got engaged.

అదేంలేదు..., అంతా ఉత్తుత్తి.. ఫుల్ క్లారిటి ఇచ్చేసింది

Posted: 11/18/2014 11:13 AM IST
Trisha condemns engagement rumors

టాలీవుడ్ హీరోయిన్ త్రిష జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. సినిమాల పరంగా... వ్యక్తిగత జీవితంలో ఆమెపై ఎన్నో రూమర్లు వచ్చాయి. అయినా సరే వాటన్నిటినీ దాటుకుంటూ తన ప్లేస్ ను పదిలంగా కాపాడుకుంటూ వస్తోంది. అయితే పనిలేని మంగళివాడు పిల్లి తల కొరిగినట్లుగా.., ఖాళీగా ఉండలేని కొందరు కోలీవుడ్ ప్రముఖులు త్రిష నిశ్చితార్ధం, పెళ్లి అని ఏదేదో అనేశారు. ఇంకేముంది ఈ వార్త ఒక్కసారిగా ఇండస్ర్టీలో వ్యాపించిది. కోలీవుడ్ అంతా హాట్ టాపిక్ అయింది. చివరకు విషయం త్రిషకు తెలియటంతో.., నిశ్చితార్ధం రూమర్లపై అమ్మడు స్పందించింది.

సోషల్ మీడియా ద్వారా తాజా పుకార్లపై త్రిష వివరణ ఇచ్చింది. తనకు ఎవరితోనూ ఎంగేజ్ మెంట్ జరగలేదు అని క్లారిటి ఇచ్చింది. ఒకవేళ జరిగితే అందరికంటే ముందు తానే ఈ విషయం బయటకు చెప్తాను అని స్పష్టం చేసింది. దీంతో ఈ రూమర్లంతా ఉత్తుత్తి అని తేలిపోయింది. సినీ ప్రముఖుడు, రాడియన్స్ రియాల్టీ అండ్ మీడియా అధినేత వరుణ్ మనియన్ తో ఈనెల 16న త్రిష నిశ్చితార్ధం జరిగిందని కోలీవుడ్ లో పుకార్లు వచ్చాయి. మీడియాలో కూడా ఈ మేరకు కధనాలు వెలువడ్డాయి. రహస్యంగా... కొందరు వ్యక్తుల మద్య ఈ కార్యక్రమం జరిగినట్లు కధనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే త్రిష వివరణ ఇచ్చింద.ి

ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణతో కలిసి సత్యదేవ డైరెకక్షన్ లో ‘లయన్’ (పేరు ఖరారు చేయలేదు) సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అటు కోలీవుడ్ లో అజిత్ తో కలిసి ‘యెన్నై అరిన్ ధల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.., ఆ మద్య రానాతో ప్రేమాయణం నడిపినట్లు పుకార్లు వచ్చాయి. అయితే కేవలం స్నేహితులమే అని ఇద్దరు చెప్పారు. మద్యలో విడిపోయినట్లు కన్పించినా.., సైమా అవార్డుల కార్యక్రమం సందర్బంగా మళ్లీ వీరి ఫొటోలు బయటకు వచ్చి కొత్త ఊహాగానాలకు తెరతీశాయి. అలా కొద్దిరోజులు గడిచేలోపే మళ్లీ విడిపోయారు అని తెలిసింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha  engagement  koliwood  rumors  latest news  rana  

Other Articles