Sara loren film career interview pakistan actress film industry secrets

sara loren news, sara loren interview, sara loren hot photo shoot, sara loren hot photos, sara loren movies, sara loren wikipedia, sara loren biography, sara loren murder 3 movie, pakistan actresses

sara loren film career interview pakistan actress film industry secrets

ఫిల్మ్ ఇండస్ట్రీ రహస్యాలను బయటపెట్టిన పాక్ పిల్ల!

Posted: 11/15/2014 06:30 PM IST
Sara loren film career interview pakistan actress film industry secrets

ఏ చిత్రపరిశ్రమలో అయినా సరే.. తారలందరూ తారాస్థాయికి ఎదగాలంటే ఎన్నో కష్టాలు, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వారిలో అందం తప్పనిసరిగా వుండాలి... ఆ తర్వాతే నటనకు ప్రాధాన్యతనిస్తారు. అందుకే.. సినిమాల్లో హీరోయిన్లు మంచి నటనను కనబరుస్తూనే పొట్టిపొట్టి డ్రెస్సులు, హాట్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తుంది. దర్శకుడు ఎలా చెబితే అలా ఖచ్చితంగా చేయాల్సిందే.. లేకపోతే తర్వాత సినిమా ఆఫర్లు రాకుండా పోతాయి. తెరముందు తారలందరూ ఆనందంగానే కనిపిస్తారుగానీ.. తెరవెనుక చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. మూవీ ఆఫర్లకోసం నానాతంటాలు పడాలి. ఇండస్ట్రీలో మంచి పేరు సాధించాలంటే.. అందుకు అన్ని వదులుకోవాల్సి వస్తుంది. కానీ వారసుల విషయానికొస్తే ఇన్ని కష్టాలు వుండవు.. ఇలా ఈ విధంగా పాకిస్తాన్ అమ్మడు సారాలోరెన్ తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది.

నాలుగేళ్ల క్రితం ‘కజ్రారే’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన ఈ పాకిస్థానీ భామ.. ‘మర్డర్ 3’ సినిమాతో ప్రేక్షకులను బాగానే రక్తికట్టించింది. కానీ.. తర్వాత ఆమెకు అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ‘బర్కా’ మూవీలో నటించడంతోపాటు ‘వెల్ కమ్ బ్యాక్’ మూవీలో ప్రత్యేకగీతంలో కనిపించనుంది. అందంతోపాటు మంచి నటనను కరబరిచిన ఈ అమ్మడు.. సినిమాల విషయంలో చాలా వెనుకబడి వుండిపోయింది. ‘ఏంటి సినిమాల విషయంలో వెనుకబడ్డారు’ అని ఓ ఇంటర్వ్యూలో నేపథ్యంలో ఆమెను ప్రశ్నించగా.. అందుకు ఆమె పరిశ్రమలో జరిగే రహస్య వివరాలను పూర్తిగా విశ్లేషించింది. చిత్రపరిశ్రమలో తనతోపాటు ఇతర అమ్మాయిలు అవకాశాల ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో.. ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందో.. మొత్తం రివీల్ చేసింది.

‘హిందీ చిత్రపరిశ్రమలో కొత్తగా వచ్చే వాళ్లు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. స్టార్ హోదాను సంపాదించుకోవాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. కానీ అదే వారసుల విషయానికొస్తే.. ఇంతగా కష్టపడాల్సిన అవసరం వుండదు. వాళ్ల తండ్రో, తలల్లో ఓ ఇరవైయేళ్ల నుంచి పరిశ్రమలో వుండటం వల్ల తొలి సినిమాతోనే తెగ ప్రచారాన్ని పొందేస్తారు. కానీ ఇలా వచ్చిన వారిలో చాలామంది నటన అంతంత మాత్రంగానే వుంటుంది. అయితే ప్రచారంతో వచ్చిన పేరు అంతంత మాత్రమే! పరిశ్రమలో తారగా మంచి పేరు సాధించాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అభిమానులను నటనతో పూర్తిగా ఆనందపరచాలి. వాళ్లు స్వీకరించినప్పుడే మనకు మంచి స్థానం దొరుకుతుంది. ప్రస్తుతం నేను అలాగే భావిస్తున్నాను. నాకిక్కడ విజయాలు కావాలి. ఒక్క విజయం దక్కితే చాలు.. పరిస్థితులు వాటంతట అవే మారిపోతాయి’’ అని పేర్కొంది అమ్మడు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sara loren  pakistan actresses  bollywood news  telugu news  

Other Articles