అనుకోని, ఊహించని సంఘటనలు జరిగితే అంతా షాక్ అవుతారు. కాని అనీషా మాత్రం టార్గెట్ అయింది. ‘గబ్బర్ సింగ్2’ మూవీలో హీరోయిన్ ఆఫర్ కొట్టేసి అమ్మడు టాలీవుడ్ కు టార్గెట్ అయింది. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు, తమ బిజీ షెడ్యూల్ ను ఈ సినిమా కోసం సర్దబాటు చేసుకునేందుకు, అవసరమైతే వేరే చాన్సులు వదులుకునేందుకు సిద్దంగా ఉన్నారు. పవన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే అనుకోకుండా.., ఎవరూ ఊహించలేనట్లుగా తెలుగమ్మాయి అనిషా అంబ్రోస్ ‘గబ్బర్ సింగ్2’ అని సంచలన ప్రకటన బయటకు వచ్చింది.
అప్పటివరకు అంతగా ప్రచారంలో లేని అనీషా.. ఒక్కసారిగా పాపులర్ అయింది. ఎంతలా అంటే అమ్మడి ఫేస్ బుక్ పేజికి గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు మూడు వేలకు పైగా లైకులు వచ్చాయి. దీనికి తోడు ఇప్పుడంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమాలో ఎలా సెలక్ట్ అయింది. ఇందుకు కారణాలేమిటి అని టాలీవుడ్ లో హాట్ చర్చలు సాగుతున్నాయి. హీరోయిన్లు అయితే దీనిపై బిగ్ డిస్కషన్లు నడుపుతున్నారు. అనీషను ఎందుకు తీసుకున్నాడు. మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు అని తమను తాము ప్రశ్నించుకుంటున్నారట.
ఇలా సైలెంట్ గా వచ్చి.., సునామీ సృష్టించిన అంబ్రోస్ మొత్తానికి పవన్ సినిమా హీరోయిన్ అయింది. గత నెలలో పవన్ ‘గోపాల గోపాల’ షూటింగ్ లో ఉండగా ఈ అమ్మడు వెళ్ళి కలిసి ఫొటో దిగింది. ఇది నెట్ లో అప్ లోడ్ చేసి.., ‘‘అభిమాన హీరో పవన్ ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జీవితంలో మరువలేని రోజు’’ అని తెలిపింది. అయితే అప్పుడెవరూ ఈమె పవర్ స్టార్ పక్కన హీరోయిన్ లా నటిస్తుంది అనుకోలేదు. కాని అదృష్టం ఉంటే అ..,ఆ రాకపోయినా అమెరికా వెళ్ళవచ్చు అనేందుకు అనిషా ఉదాహరణ.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more