Kaththi telugu movie story 20minutes trimmed by censor borad

kaththi collections, kaththi movie telugu release date, kaththi telugu songs online, hero vijay next movie, tollywood latest news

kaththi telugu movie story 20minutes trimmed by film unit: telugu version of kaththi movie trimmed by 20minutes of scenes by film unit which will not suit for telugu people

తెలుగులో కత్తి పూర్తి విడుదల లేనట్లే

Posted: 11/10/2014 04:38 PM IST
Kaththi telugu movie story 20minutes trimmed by censor borad

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ సినిమా తెలుగులో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతోంది. డబ్బింగ్ హక్కులు సొంతం చేసుకున్న నిర్మాత ఠాగూర్ మధు, వేగంగా డబ్బింగ్ పనులు చేయిస్తున్నారు. రీరికార్డింగ్ పూర్తికావస్తుండగా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షెడ్యూల్ ప్రకారం జరిగేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో పూర్తిగా విడుదల చేయటం లేదని తెలుస్తోంది. సినిమాలో తెలుగు ప్రేక్షకులకు సంబంధం లేని, అభిరుచికి దూరంగా ఉండే సీన్లను కట్ చేశారు.

దీంతో తమిళంలో 2గంటల 46నిమిషాలు ఉన్న ‘కత్తి’ తెలుగులో 2గంటల 26 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నమాట. వీటిని తీసివేయటంపై ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని సినిమా యూనిట్ తెలిపింది. నవంబర్ 21 లేదా నవంబర్ 28న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్, సమంత కాంబినేషన్ లో వచ్చిన ‘కత్తి’ తమిళంలో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు, తర్వాత వివాదాలు చుట్టుముట్టినా ప్రేక్షకులు మాత్రం సినిమాకు బ్రహ్మరధం పట్టారు.

ఇక తెలుగులో ముందుగా పవన్ తో రీమేక్ చేయించాలి అనుకున్నారు. దీనికి ముందు విజయ్ ఒప్పుకోకపోవటం, ఆ తర్వాత నిర్మాతలు ఒప్పించటం జరిగింది. చివరకు సినిమా చూసిన పవన్ తాను రీమేక్ చేయను అని చెప్పాడు. దీంతో గతంలో అనుకున్నట్లుగానే డబ్బింగ్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో కలెక్షన్లు కురిసిన ‘కత్తి’ని తెలుగు ప్రేక్షకులు ఏం చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaththi  telugu  tollywood  latest news  

Other Articles