Sruti hassan joins in mahesh babu movie shooting

sruti hassan next movie, sruti hasan mahesh babu movie, mahesh babu movie with koratala shiva, mahesh babu shooting latest news, mahsh sruti hasan movie, tollywood latest news

sruti hassan joins in mahesh babu movie shooting : star heroine sruti haasan joined in shooting with mahesh babu in his latest movie. mahesh babu and sruti hasan in shooting for their latet movie in pune

శృతి కలిపింది

Posted: 11/10/2014 03:18 PM IST
Sruti hassan joins in mahesh babu movie shooting

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది. తాజా సమాచారం ప్రకారం, మహేష్ లేటెస్ట్ నటిస్తున్న శృతి, షూటింగ్ లో పాల్గొంటోందని సినిమా యూనిట్ తెలిపింది. ఈ మద్యే పూణేలో మహేష్ తో ఈ షూటింగ్ ప్రారంభం కాగా., ఇందులో లేటెస్ట్ గా శృతి కలిసింది. ఇక్కడ షెడ్యూల్ ఈనెల 16తో ముగుస్తుందని తెలుస్తోంది. ఇక్కడ పలు కీలక సీన్లు షూట్ చేస్తున్నారని సమాచారం. పూణె షెడ్యూల్ పూర్తయితే, ఆ తర్వాత హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

‘ఆగడు’ తర్వాత మహేష్ చేస్తున్న ఈ మూవీకి కొరటాల దర్శకత్వం వహిస్తున్నాడు. చివరి మూవీ ఫ్లాప్ నేపథ్యంలో, పంచ్ డైలాగులు, బడ్జెట్ తక్కువగా ఉండేట్లు మహేష్ జాగ్రత్త పడుతున్నాడు. కొరటాల చెప్పిన కధ చాలా బాగున్నట్లు టాక్ రావటంతో సినిమాపై అభిమానులు అంచనాలు పెంచుకున్నారు. ఇక గోల్డెన్ లెగ్ గా ప్రూవ్ అయిన శృతి ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు.

మైత్రి మూవీ బ్యానర్స్ పై వస్తున్న ఈ సినిమాను రవిశంకర్, మోహన్, నవీన్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. త్వరలోనేఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sruti hasan  mahesh babu  koratala shiva  latest news  

Other Articles