Akkineni akhil first movie latest updates

akkineni akhil latest news, akkineni akhil new movie, akkineni akhil movie with vv vinayak, vv vinayak next movie, tollywood latest updates

akkineni akhil first movie latest updates : tollywood talk saying that akkineni family new hero akhil first movie getting late because of akhil only. akhil akkineni learning fights and dance also building body for his first movie so project getting late to start shoot

అఖిల్ ఎంట్రీ కోసం వినాయక్ కసరత్తు

Posted: 11/06/2014 04:14 PM IST
Akkineni akhil first movie latest updates

అక్కినేని ఫ్యామిలి నుంచి వస్తున్న కొత్త హీరో అఖిల్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..., ఎంట్రీ ఎలా ఉంటుందా అని ఆరాటపడుతున్నారు. అయితే అఖిల్ కోసం అభిమానులు మరికొంతకాలం ఆగకతప్పదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలయ్యేందుకు ఇంకా సమయం పడుతుందట. దీనికి అఖిల్ కారణం అని కొందరు అంటుంటే.. కాదు డైరెక్టర్ కారణం అని మరికొందరు చెప్తున్నారు.

అఖిల్ ను వెండితెరకు వివి వినాయక్ పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కోట్ చేశాడట. ఈ మొత్తానికి కింగ్ ఫ్యామిలి ఓకే చెప్పి సినిమా సూపర్ గా ఉండాలి అని చెప్పింది. కాగా.., అఖిల్ బాడీ పరంగా చూడటానికి సన్నగా ఉండటంతో కాస్త కండపట్టాలి అని సూచించాడు. ఎందుకంటే సన్నగా తీగలా ఉన్న హీరో.. భారీ సైజు విలన్లను ఎగిరి కొట్టడం.., ఒకే దెబ్బకు పడగొట్టగం చూసేవారికి ఇబ్బందిగా ఉంటుంది. దీంతో కాస్త కండలు పెంచితే హీరోయిజం చూపించవచ్చు అని సూచించాడు.

డైరెక్టర్ చెప్పిన ప్రకారం.., జిమ్ లో కండలు పెంచేందుకు ప్రస్తుతం అఖిల్ తెగ కసరత్తు చేస్తున్నాడట. ఇక గతంలోనే నేర్చుకున్న డాన్స్, ఒంట్లో ఉన్న యాక్టింగ్ బ్లడ్ కలిపేసి రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇలా కండలు పెంచే పనిలో ఉండటం వల్లే సినిమా ఆలస్యం అవుతోందని టాక్. క్రేజ్ కారణంగా సినిమాల్లోకి రాకముందే యాడ్ లలో నటించి అభిమానులకు తానేంటో చూపించిన అఖిల్ తొలి సినిమా త్వరగా ప్రారంభం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil  vv vinayak  tollywood  latest news  

Other Articles