Gopichand uv creations movie to compitate with balakrisha movie

gopichand next movie, gopichand son name photo, gopichand uv creations movie, uv creations movies, balakrishna latest movie, balakrishna next movie, balarkishna lion movie release date, tollywood latest news

gopichand next movie to release in february 2015 : with loukyam hit gopichand is making his latest movie more expectations and his project with uv creations will release in february 2015. in february 2015 balakrishna and gopichand will comes into race by their latest movies

ఈ సారి బాలయ్యను టార్గెట్ చేశాడు

Posted: 11/05/2014 04:34 PM IST
Gopichand uv creations movie to compitate with balakrisha movie

‘లౌక్యం’ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న గోపిచంద్.., రెట్టించిన ఉత్సాహంతో తాజాగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా విషయం ఏమిటంటే.., ఈ మూవీని ఫిబ్రవరి 2015లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తే.., ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. విడుదల తేది అనుకోకపోయినా.., ఖచ్చితంగా రెండవ నెలలో మాత్రం సినిమా విడుదల చేస్తామని యూనిట్ చెప్తోంది.

ఇక సత్యదేవ డైరెక్షన్ లో వస్తున్న బాలకృష్ణ తాజా సినిమా ‘లయన్’ (పేరు ఖరారు కాలేదు) కూడా ఫిబ్రవరిలో విడుదల అవుతుందని సినిమా యూనిట్ చెప్తోంది. అంటే బాలయ్యకు 2015లో తొలి పోటి ఇచ్చేది గోపిచంద్ అన్నమాట. ‘లౌక్యం’ సినిమా విడుదల సందర్బంగా.., తన సినిమా ‘అత్తారింటికి దారేది’ని మించి కలెక్షన్లు వసూలు చేస్తుందని చెప్పాడు. ఆ స్థాయిలో కాకపోయినా.., ఈ సినిమా మాత్రం ఇంకా ఆడుతోంది. ఇక తాజా సినిమా బాలయ్యకు పోటి కావటంతో దీనిపై ఎలా కామెంట్లు చేస్తాడో అని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.

తాజా ప్రాజెక్టులో గోపిచంద్ పక్కన ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ కొడుకు సాగర్ మహతి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ వేగంగా జరుగుతోంది. ‘సాహసం’తో కోలుకున్న గోపిచంద్ ‘లౌక్యం’తో పికప్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా ఆయనకు మంచి లైఫ్ ఇచ్చేలా ఉండాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopichand  balakrishna  lion  tollywood  uv creations  

Other Articles