Manchu vishnu to romance adah sharma in ariyanambi tamil remake movie

manchu vishnu, manchu vishnu latest news, adah sharma, adah sharma latest news, adah sharma hot photos, adah sharma bikini photos, adah sharma manchu vishnu, adah sharma movie updates, mohan babu, 24frame factory banner, manchu manoj

manchu vishnu to romance adah sharma in ariyanambi tamil remake movie which is directed by devakatta and produced by mohanbabu in 24frame factory banner

మంచువిష్ణుకి ‘‘గుండెపోటు’’ సూచనలు!

Posted: 11/03/2014 03:41 PM IST
Manchu vishnu to romance adah sharma in ariyanambi tamil remake movie

తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత కం హీరోగా కొనసాగుతున్న మంచుకుటుంబ వారసుడు విష్ణుకి త్వరలోనే ‘‘గుండెపోటు’’ సూచనలున్నాయనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ‘‘ఎర్రబస్సు’’లో ప్రయాణం చేస్తున్న ఆయన చివరి స్టాప్ చేరుకోగానే ఈ సూచనలు వచ్చే అవకాశాలు వున్నాయని చెప్పుకుంటున్నారు. కాస్త కన్ ఫ్యూజన్ గా వుంది కదూ.. అయితే అసలు మేటర్ తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

‘‘ఎర్రబస్సు’’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న మంచువిష్ణు ఆ మూవీ అయిపోయిన తర్వాత ‘‘హార్ట్ ఎటాక్’’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అదాశర్మతో రొమాన్స్ చేయనున్నాడని సమాచారం! దేవకట్టా దర్శకత్వంలో మంచువిష్ణను హీరోగా తెరకెక్కబోతున్న తమిళమూవీ ‘‘అరిమనంబి’’ రీమేక్ సినిమాలో అదాశర్మను హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామంది అమ్మాయిలను పరిశీలించారు. అయితే చివరకు అదాశర్మ వద్ద ఆగారని.. దాదాపు ఆమె హీరోయిన్ గా ఖరారయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

మంచు మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచువిష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు కావాల్సిన ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పనులు జరగుతున్నాయి. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంతా క్లారిటీ ఇవ్వలేదు. అన్ని సమకూరిన అనంతరం ఈ నెల (నవంబర్)లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు అదాశర్మ చేతిలో రెండుసినిమాలున్నాయి. ఒకటి హీరో ఆదితో ‘గరం’లో రొమాన్స్ చేస్తుండగా.. మరొకటి అల్లుఅర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి మంచువిష్ణుతో ఈ అమ్మడు నటిస్తుందా..? లేదా..? అనేదే తెలియాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu vishnu  adah sharma  ariyanambi movie news  tollywood news  telugu news  

Other Articles