Sruthi hassan press meet statements movie schedules independent music album no time

sruthi hassan, sruthi hassan first love, sruthi hassan hot photos, sruthi hassan press meet, sruthi hassan movies, sruthi hassan bikini photos, sruthi hassan liplocks, sruthi hassan cleavage photos, sruthi hassan hot photo gallery

sruthi hassan press meet statements movie schedules independent music album no time

‘‘ఫస్ట్ లవర్’’తో శృతికి డ్యూయెట్ కుదరడం లేదట!

Posted: 10/31/2014 07:54 PM IST
Sruthi hassan press meet statements movie schedules independent music album no time

ఒకప్పుడు చిత్రపరిశ్రమలో ‘ఐరెన్ లెగ్’గా పేరు సంపాదించుకున్న శృతిహాసన్.. ఆ తర్వాత వరుస విజయాలతో ‘గోల్డెన్ లెగ్’గా మారిపోయిన విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళంతోపాటు హిందీతో కలిపి మూడుసినిమాలతో బిజీబిజీగా వుంది కూడా! ఎక్కువ సమయం తనకు ఈ సినిమాలకే కేటాయించడంతో తన ‘‘ఫస్ట్ లవర్’’తో గడిపేందుకు సమయం దొరకట్లేదని చెబుతోంది. చాలాకాలంగా తాను తన ఫస్ట్ లవ్ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించాలని ఎంతగానో ప్రయత్నించినా.. ఆర్టిస్టుగా బిజిగా వుండటం వల్ల అది కుదరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ హాట్ బ్యూటీ!

అసలు విషయం ఏమిటంటే.. శృతిహాసన్’ని ఎవరైనా తన ‘‘ఫస్ట్’లవ్ ఎవరు?’’ అని అడిగితే... ఒక్క క్షణం కూడా ఆగకుండా వెంటనే ‘‘సంగీతం’’ అని చెబుతోంది. ఎందుకంటే.. శృతి చిన్నప్పటినుంచి సంగీతమే ప్రపంచంగా పెరిగింది. అందుకే.. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది. అయితే తాను సొంతంగా ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది కానీ.. సినిమాలతో బిజీగా వుండటం వల్ల అది కుదరడం లేదని తెలిపింది. ఎన్నిసినిమాల్లో నటించినా.. తన మ్యూజిక్ ఆల్బమ్ కోరిక ఇంతవరకు తీరలేదన్న కోరికతో ఆమె చాలా బాధపడుతోందని సమాచారం!

ఈ నేపథ్యంలో శృతి మాట్లాడుతూ.. ‘‘నాకు ఎప్పటినుంచో ఇండిపెండెంట్ గా మ్యూజిక్ ఆల్బం చేయాలని వుంది. కానీ సమయం కుదరకపోవడం వల్ల ఇంతవరకు చేయలేకపోయాను. ఎప్పుడైనా చేయాలనుకుని అనుకుంటే.. అప్పుడే సినిమాలతో బిజీ అయిపోవడం జరుగుతోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా.. సినిమా ఆఫర్లు వస్తుండటంతో దానిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. కుదిరితే ఈసారి ట్రై చేయాలనుకుంటున్నాను. నిజంగానే ఒక ఆల్బం చేయాలంటే చాలా తీరిక కావాల్సిందే’’ అంటూ పేర్కొంటోంది అమ్మడు. మరి ఈమె కోరిక ఎప్పుడు తీరబోతోందో వెయిట్ చేయాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles