Brothers surya and karthi to dance in we love vizag event

surya on hudhud cyclone, karthi on hudhud cyclone, surya and karthi on hudhud cyclone help, we love vizag, tollywood events, latest updates surya and karthi on we love vizag, hudhud cyclone relief operations, hudhud in vishakapatnam

brothers surya and karthi to dance in we love vizag event : tamil hero brothers surya and karthi decdes to do more help to vishakapatnam by participating in we love vizag event

రియల్ హీరోలు అన్పించుకున్న స్టార్ బ్రదర్స్

Posted: 10/29/2014 01:57 PM IST
Brothers surya and karthi to dance in we love vizag event

రీల్ లైఫ్ హీరోలు సూర్య, కార్తి రియల్ లైఫ్ లో కూడా హీరోలు అన్పించుకున్నారు. ఈ మద్య వచ్చిన హుద్ హుద్ తుఫాను సందర్బంగా వీరిద్దరూ కలిసి రూ.50లక్షలు విరాళం ఇచ్చారు. తెలుగు పాపులర్ స్టార్లు కూడా ఇరవై లక్షలు ఇచ్చేందుకు ముందు వెనకా ఆలోచిస్తే తమిళ హీరోలైన వీరు తమ ఉదార స్వభావం చాటున్నారు. తాజాగా బాధితులకు మరింత సాయం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బాధితులకు ఇండస్ర్టీ తరపున సాయం చేసేందుకు ‘వియ్ లవ్ వైజాగ్’ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సూర్య, కార్తి అంగీకరించారట. అంతేకాదు ఈవెంట్ లో ఇద్దరూ కలిసి డాన్స్ చేసేందుకు కూడా ముందకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు తమిళ ఇండస్ర్లీలో జరిగిన కార్యక్రమాల్లో కూడా వీరిద్దరూ కలిసి డాన్స్ లు చేయలేదు. అలాంటిది తెలుగు పరిశ్రమ కోసం అన్నదమ్ములిద్దరూ కలిసి వస్తున్నారు. వీరి మంచితనాన్ని టాలీవుడ్ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. తమిళ సోదరుల కంబైన్డ్ షో ప్రోగ్రాంకు హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సూర్య, కార్తికి డిమాండ్ ఉంది. వీరిద్దరివి తెలుగులో వచ్చింది డబ్బింగ్ సినిమాలే అయినా ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఈ కారణం వల్లే తెలుగులో నాగార్జునతో కలిసి కార్తి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : surya  karthi  hudhud  we love vizag  

Other Articles