Hero dhanush recommends trisha as an actress in his latest movie with director velraj

hero dhanush, actress trisha, trisha latest news, trisha hot photos, trisha hot photo shoot, trisha latest news, trisha news, trisha movies, trisha wiki, trisha movie updates, trisha updates, trisha news, trisha hero dhanush, dhanush trisha

hero dhanush recommends trisha as an actress in his latest movie with director velraj

త్రిష కెరీర్ లో వేలెట్టిన తమిళ హీరో!

Posted: 10/28/2014 01:29 PM IST
Hero dhanush recommends trisha as an actress in his latest movie with director velraj

ఒకప్పుడు దాదాపు పదేళ్లవరకు టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లిన త్రిష.. తర్వాత అడ్రస్ లేకుండా కనుమరుగైపోయింది. కొత్త హీరోయిన్ల హవా ఒక్కసారిగా కొనసాగడంతో ఈ అమ్మడు అప్పుడు అదృశ్యమైపోయింది. సినిమా అవకాశాలకోసం ఎంత ప్రయత్నించినా.. ఒక్కటి కూడా ఈమె దరికి చేరలేదు. ఆమధ్య బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడ అడుగుపెట్టింది కానీ.. ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో తిరిగి వచ్చేసింది. మధ్యమధ్యలో కొన్ని ఫోటోషూట్ లు కూడా ఇచ్చి తానింకా లైమ్ లైట్ లోనే వున్నానంటూ అందరికీ గుర్తుచేసింది కానీ.. ఫలితం మాత్రం శూన్యం! దాంతో ఢీలా పడిపోయిన ఈ అమ్మడు చిన్నసినిమాల్లో, ఐటెం డ్యాన్సుల్లోనూ నటించడానికి అప్పట్లో సై అంది. అ

యితే ఇంతలోనే కన్నడ ఇండస్ట్రీ ఈమెను కనుకరించడంతో అక్కడ ‘‘దూకుడు’’ రీమేక్ ‘‘పవర్’’ నటించి.. భారీ విజయాన్ని సాధించుకుంది. అలాగే బాలకృష్ణ సరసన ఛాన్స్ కొట్టేసింది. కానీ వీటి తర్వాత ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఇప్పుడు ఈమె కెరీర్ లోకి ఓ తమిళ హీరో వేలెట్టాడని కోలీవుడ్ లో వార్తలు తెగ తిరిగేస్తున్నాయి. ఈ మూడుపదుల భామ తన కెరీర్ ని మునుపటిలా మెరుగుపర్చుకోవడం కోసం ఓ తమిళ హీరో సహాయాన్ని తీసుకోబోతోందని.. అందుకు అతను కూడా ఈమెకోసం తెగ కష్టపడుతున్నాడని సమాచారం! ఆ హీరో మరెవ్వరో కాదు.. ‘‘వై దిస్ కొలవెరీ’’ అంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్!

నిజానికి వీరిద్దరు ఎప్పటినుంచో మంచి స్నేహితులని అందరూ అంటుంటారు. ఈ సాన్నిహిత్యం వల్లే గతంలో ధనుష్ నటించిన ‘‘ఆడుగళం’’ సినిమాలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ ఇప్పించేందుకు దర్శకనిర్మాతలతో మాట్లాడాడట! అందుకు వారు అప్పట్లో ఓకే అన్నారుగానీ.. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమెను డ్రాప్ చేసేశారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాలైతే ఏవీ లేవు. అయితే ప్రస్తుతం త్రిష కెరీర్ గాడిలో పడిన నేపథ్యంలో ఆమెను ఆదుకోవడానికి ఈ హీరో సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రిష ఇప్పుడు ధనుష్ తో కలిసి ‘‘కల్సి’’ సినిమాలో నటించనుందనే వార్తలు కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.

ఇదిలావుండగా.. ఇటీవల ధనుష్ తో కలిసి ‘‘వేల ఇల్లై పట్టాదరి’’ సినిమాను రూపొందించిన వేల్ రాజ్ మళ్లీ అతనితోనే కలిసి మరో సినిమాను తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా ఎవరిని ఎంపిక చేయాలనే వేల్ రాజ్ గందరగోళంలో వుండగా.. త్రిషను తీసుకుంటే బాగుంటుందని ధనుష్ సలహా ఇచ్చాడట! దీంతో ఈ సినిమాలో కూడా త్రిషను కథానాయికగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధనుష్ రెకమెండేషన్ కారణంగానే ఈ  మూడుపదుల ముద్దుగుమ్మకి ఈ ఆఫర్ వచ్చిందని అనుకుంటున్నారు. ఏదేమైనా.. త్రిష తిరిగి ఫుల్ ఫామ్ లో వస్తోందని.. ఆమె దశ మళ్లీ తిరిగిందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha  hero dhanush  director velraj  tollywood news  telugu news  

Other Articles