Nayanatara playing a cop role in tamil movie thaniyoruvan

nayanatara, nayanatara hot photos, nayanatara jayem ravi, nayanatara ips police officer, nayanatara hot photo shoot, nayanatara latest news, nayanatara hot gossips, nayanatara thaniyoruvan movie

nayanatara playing a cop role in tamil movie Thaniyoruvan and also taking training of horse riding which is directed by hero jayem ravi

కోలీవుడ్ లో నయనతార సరికొత్త లీలలు!

Posted: 10/27/2014 03:55 PM IST
Nayanatara playing a cop role in tamil movie thaniyoruvan

చిత్రపరిశ్రమలో వున్నతారలకు సంబంధించి రూమర్లు రావడం సహజమేకానీ.. నయనతారకు వచ్చినంతగా ఏ ఒక్క తారకు వచ్చి వుండవు. గతంలో కంటే ఈమధ్యే ఈ అమ్మడి ప్రేమవ్యవహారాలకు సంబంధించి లెక్కలేనన్నీ వార్తలు ఇప్పటికీ వస్తూనే వున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంతవరకు వుంటుందో తెలియదు కానీ.. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన వార్త అటు కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లో కూడా తెగ షికార్లు చేస్తోంది. అయితే ఈసారి వచ్చిన వార్త ఆమె వ్యవక్తిగత వ్యవహారానికి సంబంధించింది కాదులెండి... తమిళ చిత్రంలో ఈ అమ్మడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనుందని సమాచారం!

తొలిసారి నయనతారతో జతకడుతున్న హీరో జయంరవి తన స్వీయదర్శకత్వంలో ‘‘తనియోరువన్’’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార క్యారెక్టర్ ఇతర సినిమాలకంటే చాలా డిఫరెంట్ గా వుంటుందని.. ఇందులో ఈ మూడుపదుల భామ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతుందని ఫిల్మ్ నగర్ సమాచారం! అలాగే తన పాత్రలో భాగంగా మూవీలో గుర్రపుస్వారీ కూడా చేయనుందని.. అందుకోసం ఈ అమ్మడు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటుందోని చిత్రవర్గాలు తెలుపుతున్నాయి. నయన ఈవిధంగా తెగ శ్రమించడాన్ని యూనిట్ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో నయన పాత్ర హైలైట్ గా నిలవనుందని.. కోలీవుడ్ లో ఓ సరికొత్త పోలీస్ ఆఫీసర్ పరిచయం కాబోతోందని చిత్రబృందం తెలుపుతోంది. మరోవైపు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఈ సంవత్సరం ఆఖరులోగానీ జనవరిలో గానీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayanatara  jayem ravi  thaniyoruvan  tamil movies  kollywood news  

Other Articles