Rakulpreet singh comments on gabbarsingh 2 movie

rakul preet singh next movie, rakul preet singh in gabbarsingh 2, rakul preet singh tollywood movies, rakul preet singh news, gabbarsingh2 movie latest updates, pawankalyan in gabbarsingh2, tollywood latest updates

rakulpreet singh comments on gabbarsingh 2 movie : tollywood latest star heroine rakul preet singh says she got no information from movie unit about her selection but she hopes to be selected in that movie

అదే నిజమైతే.., అంతకన్నా కావాలి

Posted: 10/22/2014 01:03 PM IST
Rakulpreet singh comments on gabbarsingh 2 movie

రెండు సినిమాలతో హిట్ కొట్టేసి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.., పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్2’ సినిమాలో నటిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. అమ్మడు దశ తిరిగిందని.., ఇక టాప్ హీరోయిన్ అవటం ఖాయమని అంతా ఊహించేసుకున్నారు. రకుల్ కూడా ఇలానే భావించిందట. ఎందుకంటే ఇవన్నీ కేవలం ఊహాగానాలే కాబట్టి. అంటే ‘గబ్బర్ సింగ్2’ సినిమాకు ఈ అమ్మడు ఎంపిక అయినట్లు ఆమెకు ఎవరూ చెప్పలేదట.

తాజా ఊహాగానాలపై వివరణ ఇచ్చిన రకుల్ ‘నేను గబ్బర్ సింగ్2 సినిమాలో నటిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవి ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో తెలియదు. కానీ.., ఇదే నిజం కావాలని కోరుకుంటున్నా.’ అని తెలిపింది. పవన్ తో నటించాలని ప్రతి హీరోయిన్ కు ఉంటుంది. అలాగే తాను కూడా పవర్ స్టార్ పక్కన కన్పించాలని ఉవ్విళ్ళూరుతున్నట్లు తెలిపింది. కాని ఇప్పటివరకు ఈ సినిమా ఆఫర్ పై తనను ఎవరూ సంప్రదించలేదట. దీంతో కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా టాలీవుడ్ లో రికార్డులను క్రియేట్ చేసింది. ఇది పవన్ కు మంచి మైలేజ్ ఇవ్వటంతో పాటు.., ఐరన్ లెగ్ గా పేరుపొందిన శృతికి హిట్ అందించి గోల్డెన్ లెగ్ అనేలా చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా కధను సిద్ధం చేసుకున్న సంపత్ సినిమా తీసేందుకు వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ వెంకటేష్ తో కలిసి ‘గోపాల గోపాల’ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత ఈ నంది ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gabbarsingh2  rakul preet singh  latest updates  

Other Articles