Preety zinta fires on media for asking questions about ness wadia case

preesty zinta, preety zinta latest news, preety zinta fires on media, preety zinta awards show, preety zinta hot photo shoot, preety zinta ness wadia, ness wadia case, preety zinta ness wadia case, mumbai media

preety zinta fires on media for asking questions about ness wadia case

మీడియావాళ్లకు లాంగ్ క్లాస్ పీకిన ప్రీతి!

Posted: 10/20/2014 04:21 PM IST
Preety zinta fires on media for asking questions about ness wadia case

ప్రీతిజింతా, నెస్ వాడియా మధ్య వచ్చిన వివాదాలు బాలీవుడ్ లో ఎంత సంచలనంరేపాయో అందరికీ తెలిసిందే! ఆ వ్యవహారంలో ఇంతకీ ఏం జరిగిందో, ఆ కేసు ఎలా మలుపులు తిరుగుతుందో ఇంకా అర్థంకాని ప్రశ్నగానే నిలిచిపోయింది. అటు పోలీసులతోపాటు ఇటు మీడియావాళ్లు కూడా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో మునిగిపోయారు. అందుకే.. ప్రీతిజింతా ఎక్కడ కనబడితే అక్కడ అందరూ మైకులు పట్టుకుని ఆమె మాజీ ప్రియుడు నెస్ వాడియా గురించి, అతడిప పెట్టిన కేసు గురించి ఆమెను ప్రశ్నలమీద ప్రశ్నలు అడిగేస్తున్నారు. దీంతో ప్రీతిజింతా బయటికి రావడమే మానేసింది. అందుకే... ఈ అమ్మడు గతకొద్దిరోజుల నుంచి మీడియాకంట పడకుండా రహస్యంగానే తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

అయితే ముంబైలో జరిగిన ఎంఏఎంఐ ఫిలిం ఫెస్టివల్ కు ఎవరికీ తెలియకుండా హాజరైన ప్రీతి... ఎవరికీకంటా పడకుండా అక్కడి నుంచి జారుకుందామని ప్రయత్నించింది. కానీ అది సాధ్యపడలేదు.. ఎలాగోలా మీడియావాళ్లకు ఆమె దొరికిపోయింది. అంతే.. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లిన మీడియావాళ్లు.. మొదట్లో ఆమెకు సంబంధించిన రెండు ప్రశ్నలు అడిగి, తర్వాత నెస్ వాడియా టాపిక్ పై ప్రశ్నించారు. ‘‘మీరు నెస్ వాడియాపై పెట్టిన కేసు ఏమైంది..? ఆ వ్యవహారం ఎంతదాకా వచ్చింది..?’’ ఆమెను ఒకరిమీద ఒకరు ప్రశ్నలు అడగటం మొదలుపెట్టేశారు. ఈ ప్రశ్నలకు మొదట్లో కాస్త ప్రశాంతంగా వ్యవహరించిన ప్రీతి.. ఒకర్నొకరు ఆ కేసు విషయమై వరుసగా ప్రశ్నలు సంధించడంతో ఒక్కసారిగా ఫైర్ అయింది. అయితే తన్నుకొస్తున్న తన కోపాన్ని మీడియావాళ్ల మీద చూపించలేదు కానీ.. వారికి క్లాస్ మాత్రం చాలా గట్టిగానే పీకిందని సమాచారం!

‘‘నేను ఇక్కడికి రావడానికి కారణమేంటి..? మీరు అడుగుతున్న ప్రశ్నలేమిటి..? ఒకవేళ మీకు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ముంబై పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్లి నేరుగా అడగండి. ఎందుకంటే.. నేను కూడా ఇవే ప్రశ్నలు వాళ్లను అడగాలంటున్నాను. నేను కూడా అందరిలాగే ఈ కేసు కోసం చాలామంది వెనుక నిలబడి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేనిప్పుడు సెలబ్రిటీని కాదు.. మీలాగే ఒక మామూలు అమ్మాయినే! నేను చట్టాన్ని మాత్రమే నమ్ముతాను.. దాని ప్రకారం ఏం జరుగుతుందో చూద్దాం..! నన్ను ప్రశ్నిస్తే ఏమి తెలియదు’’ అని చెప్పేసి ఈ అమ్మడు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : preety zinta  ness wadia  mumbai media  mami film festival  telugu news  

Other Articles