ఈ మద్య మల్టీస్టారర్ సినిమాల క్రేజ్ ఎక్కువగా కన్పిస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లు కూడా బాగానే హిట్ అవుతున్నాయి. దీంతో చిన్నా పెద్దా హీరోలు అనే తేడా లేకుంటా అంతా ఈ తరహా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలు మల్టీస్టారర్ ప్రాజెక్టులు సిద్ధం అవుతుండగా.., తాజాగా నాగార్జున కూడా మల్టీస్టారర్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. కోలీవుడ్ హీరో కార్తి ఇందులో మరో స్టార్ అని ఫిలింనగర్ నుంచి అప్ డేట్స్ వస్తున్నాయి.
ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ‘ఎవడు’ హిట్ తర్వాత మళ్ళీ కధ పట్టుకుని వచ్చిన వంశీ.., నాగార్జున-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేయాలనుకున్నారు. అయితే వరుస ఫ్లాపుల కారణంగా ప్రయోగాలు అంటే వెనకముందు ఆలోచిస్తున్న యంగ్ టైగర్ ఈ ప్రాజెక్టు చేయను అని చెప్పారట. దీంతో మరో పాపులర్ హీరో కోసం ట్రై చేస్తుండగా.. సింప్లిసిటీ, ఫ్యామిలీ పర్సన్ లా ఉండే కార్తి వీరికి కన్పించాడట. తమిళ హీరో అయినా తెలుగులో పరిచయం ఉన్న నటుడే. దీంతో ఈయన్ను తాజా మల్టీస్టారర్ సినిమాలో హీరోగా పెడుతున్నారట.
కార్తీకి తమిళంలో కూడా మంచి పేరు ఉండటంతో అక్కడ కూడా విడుదల చేసేలా సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఇక వంశీ కధకు హీరోతో పాటు నిర్మాత కూడా మారారు. ముందుగా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఉంటానని ముందుకు వచ్చారు. అయితే ‘రభస’ ‘ఆగడు’ సినిమా నైజాం డిస్ర్టిబ్యూషన్ తీసుకుని చేతులు కాల్చుకున్నాడు. దీంతో ఇబ్బందుల మద్య సినిమాలు చేయలేను అని బయటకు వచ్చేశాడు. ప్రాజెక్టు ఆసక్తికరంగా ఉండటంతో పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి ప్రసాద్ నిర్మాతగా ఉంటానని ముందుకు వచ్చాడని వంశీ సన్నిహితులు చెప్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more