Ambala film unit praises hansika

hansika movies, hansika next movie, hansika hot photos, allu arjun movies, tollywood latest updates, honey bee bites hansika, hansika in ambala movie, hansika in tamil ishq movie, tamil movies latest updates, koliwood latest updates

ambala film unit praises hansika : honey bee bites actress hansika during ambala movie shooting she got veri main and hand swells but not stops shooting, says she is ready to act by this ambala movie unit praised hansika

నొప్పులొచ్చినా షూటింగ్ ఆపలేదు

Posted: 10/17/2014 04:14 PM IST
Ambala film unit praises hansika

సినిమా స్టార్లు అంటే ఇష్టముంటే నటిస్తారు. ఏమాత్రం ఇబ్బంది కలిగినా ప్యాకప్ చెప్పేస్తారు అని అంతా అనుకుంటారు. కాని హన్సిక అలా కాదు అని తమిళ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకు ఓ ఉదాహరణ కూడా చెప్తున్నాయి. విశాల్ హీరోగా ‘అంబాల’ సినిమాలో హన్సిక నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో హన్సిక ఎడమచేతికి తేనెటీగ కుట్టిందట. దీంతో విపరీతమైన నొప్పి కలగటంతో పాటు చేయి కూడా వాచిపోయిందట. వెంటనే స్పందించిన సినిమా యూనిట్ వర్గాలు ఆరోజు షూటింగ్ వాయిదా వేద్దామనుకున్నారు.

అయితే వాయిదా ఏమి వద్దు అని నొప్పిని భరిస్తూనే నటించిందట. ప్రొడ్యూసర్, డైరెక్టర్ రెస్ట్ తీసుకొండి మేడమ్ అని చెప్పినా కూడా పరవాలేదు అని షూటింగ్ లో పాల్గొదట. దీంతో అమ్మడిని అంతా తెగమెచ్చేసుకుంటున్నారు. డబ్బులు, నటన విలువ తెలిసిన నటి అని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు కంటే తమిళంలోనే పాప బిజీగా ఉంది. దాదాపు 8 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వరుస హిట్ల వల్ల ఇది సాధ్యమయిందని తెలుస్తోంది.

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఇష్క్’ సినిమాను త్వరలో తమిళంలో తీస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సిక ఎంపిక అయిందని తెలుస్తోంది. నాటితరం నటి జయప్రద కొడుకు సిద్దు హీరోగా డైరెక్టర్ రాజశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మాస్ డైరెక్టర్ గా పేరు ఉన్న రాజశేఖర్ ఈ సూపర్ హిట్ లవ్ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తాడా అని కోలివుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అటు కొత్త హీరో పక్కన ఎనమిదేళ్ళ సీనియారిటీ ఉన్న హన్సికను హీరోయిన్ గా పెట్టడంతో వీరిద్దరికి సెట్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : hansika  ambala  koliwood  shooting  

Other Articles