హీరోయిన్ నుంచి దర్శకురాలు అయిన తర్వాత రేణు దేశాయ్ లో సృజనాత్మకత, ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పే తత్వం పెరిగింది. అంతేకాకుండా ఇదివరకు చెప్పినట్లుగా కాకుండా వెరైటీగా లోతుగా ఆలోచించేలా సమాధానాలు చెప్తోంది. ఆమె తాజా చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాపై సోమవారం రోజు హైదరాబాద్ లో మీడియాతో రేణు ముచ్చటించింది. చాలాకాలం తర్వాత నగరానికి వచ్చిన రేణు దేశాయ్ ను పలు మీడియా సంస్థల ప్రతినిదులు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్బంగా ఆమె పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
ప్రస్తుతం సొంతంగా డైరెక్ట్ చేసి నిర్మించిన ‘ఇష్క్ వాలా లవ్’ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే ఉద్దేశ్యంతోనే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నట్లు రేణు చెప్పింది. ఇక భవిష్యత్తులో మాత్రం ఓ సినిమాను సొంతంగా నిర్మించి, డైరెక్ట్ చేయబోను అని ప్రకటించింది. అయితే నిర్మాతగా లేదా డైరెక్టర్ గా ఏదో ఒక బాధ్యతను మాత్రమే తీసుకుంటానని చెప్పింది. ఇక ఈ సినిమా ద్వారా అఖిరా నందన్ ను ఇండస్ర్టీకి పరిచయం చేస్తున్నందుకు తల్లిగా చాలా సంతోషిస్తోందట. ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రాసుకున్న కథను ఇప్పుడు తెరకెక్కించినట్లు చెప్పింది. ప్రేమ, పెళ్ళి విషయంలో ప్రస్తుత యువత అనుసరిస్తున్న విధానాలను ప్రేరణగా తీసుకుని ఈ కధ రాసుకుందట. ఇందుకోసం ఎంతోమంది యువతీ యువకులను ఇంటర్య్వూ చేసి అభిప్రాయాలు సేకరించి మరీ కధ సిద్దం చేసుకుందట. మామూలుగా అయితే అబ్బాయిలు పెళ్లికి నో చెప్తారు కాని.. ఈ మూవీలో అమ్మాయి పెళ్లి వద్దు అంటుంది. అలా ఎందుకు అంటుంది అనేది ట్విస్ట్ అని సస్పెన్స్ క్రియేట్ చేసింది.
‘ఇష్ వాలా లవ్’కు నేటి యువత ప్రేరణ అయితే తనకు పవన్ కళ్యాణ్ ప్రేరణ అని స్పష్టం చేసింది. ఆయన ఇచ్చిన స్పూర్తి, ధైర్యంతోనే ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. ఇక మూవీతో తన జీవితానికి దగ్గరి సంబంధం ఉందన్న ఊహాగానాలను తోసిపుచ్చింది. ‘ఇష్ వాలా లవ్’తో తనకు ఏ సంబంధం లేదు అని ప్రకటించింది. అంతా చెప్తున్నట్లు పెళ్ళి జరిగాక తన జీవితంలో ప్రేమ తగ్గలేదని వెల్లడించింది. ఇప్పటికీ, ఎప్పటికీ తనలో ప్రేమ అలాగే ఉంటుందని స్పష్టం చేసింది. అనుకోకుండానే సినిమా నటి అయిన తను అనుకోకుండా నిర్మాత, దర్శకురాలిగా మారిపోయాననీ మళ్ళీ అవకాశం వస్తే నటించవచ్చు కూడా అని పేర్కొంది.
మరాఠీలో నిర్మించిన తొలి సినిమా ‘మంగళాష్టక్’ హిట్ కావటంతో రేణు దేశాయ్ రెండవ సినిమా ‘ఇష్ వాలా లవ్’ నిర్మించటంతో పాటు డైరెక్ట్ చేసింది. ఈనెల 24న ఈ సినిమా మరాఠీతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతుందని రేణు దేశాయ్ వెల్లడించింది. పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా నందన్ ఇందులో నటించటంతో.., సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పవన్ ప్రభావం వల్ల తెలుగులో కూడా ‘ఇష్ వాలా లవ్’ బాగానే ఆడుతుంది అని ఊహాగానాలు వస్తున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more