Akkineni nagarjuna praises pooja hegde oka laila kosam movie

akkineni nagarjuna, oka laila kosam movie, pooja hegde, pooja hegde hot photo shoot, pooja hegde news, nagarjuna pooja hegde, mukunda movie, oka laila kosam mukunda movie, hrithik roshan

akkineni nagarjuna praises pooja hegde oka laila kosam movie

జూ.ఇల్లీపై మనసు పారేసుకున్న మన్మథుడు!

Posted: 10/11/2014 12:48 PM IST
Akkineni nagarjuna praises pooja hegde oka laila kosam movie

చిత్రపరిశ్రమలో కొత్తగా వచ్చిన తారలు కొంచెం పేరు సంపాదించుకుంటే చాలు.. వారిమీద సినీప్రముఖులు అప్పుడప్పుడు ప్రశంసలు కురిపిస్తుంటారు. కొన్నాళ్లవరకు ఆ తారల గురించి వార్తలు షికార్లు చేస్తాయి. ఒకవేళ వారికి అదృష్టం కలిసి వస్తే స్టార్ హీరోయిన్లుగా కూడా మారిపోతారు.. లేదా కుర్రహీరోలతోనే సక్సెస్ ఫుల్ తారలుగా కొనసాగుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ కి వచ్చిన కొత్త భామలందరూ తమతమ ప్రతిభతో మంచి పేరు సంపాదించుకున్నవాళ్లే! వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి సక్సెస్ ను పొందుతున్నారు కానీ.. ప్రత్యేక గుర్తింపంటూ ఎవ్వరికీ రాలేదు. కానీ పూజా హెగ్డే విషయంలో మాత్రం అలాకాదు... ఈమె ఎంట్రీ ఇచ్చుకున్న మొదటి సినిమా నుంచి నిత్యం వార్తల్లో తిరుగుతూ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఏకంగా బాలీవుడ్ లో ఓ భారీ ఆఫర్ నే కొల్లగొట్టేసింది. ఇంత తక్కువకాలంలోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న అమ్మడు ఈమేనని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

ముంబైకి చెందిన పూజాహెగ్డే.. చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుదామని మూడేళ్లక్రితం సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే ఈ అమ్మడికి అంత సీన్ ఏమీలేదంటూ టాలీవుడ్ పక్కనపెట్టడంతో కన్నడలో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేయగలిగింది. తర్వాత సినిమాల కోసం రెండేళ్లవరకు కాలక్షేపం చేసింది. ఇంతలోనే ఆమెకు అదృష్టం తలుపుతట్టేసింది. టాలీవుడ్ లో వరుసగా ‘‘ఒకలైలా కోసం, ముకుంద’’ వంటి చిత్రాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది. దీంతో ఈ భామకు సంబంధించిన వార్తలు కొన్నిరోజులవరకు బాగానే కోడై కూశాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా హృతిక్ రోషన్ సరసన ‘‘మొహెంజోదారో’’లో నటించే ఛాన్స్ ఈమెకు వరించింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. అంతే! సినీ ప్రముఖులందరూ ఇప్పుడు ఈమె జపం చేసుకుంటూ కూర్చుండిపోయారు. ఈమెను ‘‘ఫ్యూచర్ స్టార్ హీరోయిన్’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ జాబితాలో మన టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా చేరిపోయాడు.

నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘‘ఒక లైలా కోసం’’ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే! ఇంకా ఆ సినిమా విడుదల కాకముందే నాగార్జున ఈ అమ్మడి అందానికి దాసోహమైపోయాడంటూ చెప్పుకుంటున్నారు. ‘‘పూజా చాలా ప్రతిభావంతురాలు. బాగా నటించడంతోపాటు డ్యాన్సుల్లోనూ ఇరగదీస్తోంది. అలాగే వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్న ‘‘ముకుంద’’ సినిమాలోనూ పూజా అద్భుతంగా నటించింది. ఆ సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. నాగచైతన్యతో తొలివిజయాన్ని అందుకోవడంతోపాటు వరుణ్ తేజ్ తో రెండో విజయాన్ని సాధిస్తుంది’’ అంటూ ఆమెను ఆకాశానికెత్తేశాడు. ‘‘ఒక లైలాకోసం’’ సినిమా సెప్టెంబర్ 17వ తేదీన రిలీజవుతున్న విషయం విదితమే! ఆ నేపథ్యంలోనే నాగార్జున పూజ గురించి ఇలా పొగిడేసి వుంటాడని చిత్రవర్గాలు అంటున్నాయి. అలాగే ముకుంద కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ అమ్మడికి అప్పుడే భారీగా అవకాశాలు వస్తున్నాయని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pooja hegde  akkineni nagarjuna  oka laila kosam  mukunda movie  tollywood news  

Other Articles