Gopichand loukyam movie getting huge responce in collections than ram charan govindudu movie

ram charan news, ram charan govindudu movie, gopichand news, gopichand loukyam movie, govindudu andari vadele collections, loukyam movie collections, govindudu andarivadele loukyam movies, ram charan gopichand news, tollywood trade news

gopichand loukyam movie getting huge responce in collections than ram charan govindudu movie

రామ్ - గోపీ ఫ్యామిలీల మధ్య గొడవ..

Posted: 10/11/2014 10:53 AM IST
Gopichand loukyam movie getting huge responce in collections than ram charan govindudu movie

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, గోపీచంద్ ఫ్యామిలీల మధ్య బాగానే గొడవ జరుగుతోందని తెలుగు చిత్రపరిశ్రమలో చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో టాలీవుడ్ లో అనతికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ లాంటి హీరో... గోపీచంద్ ముందు తగ్గినట్లున్నాడని చెప్పకుంటున్నారు. ఎప్పుడూ ఊహించని విధంగా ఈసారి రామ్ చరణ్ కు గోపీ నుంచి ఎదురుదెబ్బ తగిలిందని... దీంతో చెర్రీ చాలా డిసప్పాయింట్ అయ్యాడని అంటున్నారు. అయితే ఈ గొడవ జరుగుతోంది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో!

ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ తో కూడిన రామ్ చరణ్ ‘‘గోవిందుడు అందరివాడేలే’’, గోపీచంద్ ‘‘లౌఖ్యం’’ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే! ఈ రెండు మంచి టాక్ తెచ్చుకోవడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లపరంగానూ దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం... ఎలాంటి అంచనాల లేకుండా ప్రేక్షకులముందుకొచ్చిన గోపీచంద్ ‘‘లౌఖ్యం’’ విడుదలై రెండు వారాలు అయినప్పటికీ ఇంకా మంచి కలెక్షన్లను రాబడుతోందని, ఈ విషయంలో చెర్రీ ‘‘గోవిండుదు’’ వెనక్కి తగ్గాడని చెబుతన్నారు. కలెక్షన్లపరంగా గోవిందుడు మంచి వసూళ్లు సాధించినా.. ప్రస్తుతం చాలావరకు తగ్గిపోయాయని.. లౌఖ్యం చిత్రానికి ఇప్పటికీ అనూహ్య స్పందన లభించడంతోపాటు మంచి వసూళ్లను రాబడుతోందని చెబుతున్నారు. వరల్డ్ వైడ్ గా టూ వీక్స్ కు ‘‘లౌఖ్యం’’ దాదాపు 17 కోట్ల రూపాయల కలెక్షన్లు చేసినట్లు తెలుస్తోంది.

సరైన హిట్స్ లేక కెరీర్ గాడిలో పడిపోయిన సమయంలో గోపీచంద్ కు ‘‘సాహసం’’ మంచి విజయాన్ని అందించినా.. కలెక్షన్లు మాత్రం రాబట్టుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం వచ్చిన ‘‘లౌఖ్యం’’ సినిమా మంచి స్పందనతోపాటు ఎక్కువ కలెక్షన్లను వసూలు చేయడంతో... ఈ సినిమా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోవడంతోపాటు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చెప్పుకుంటున్నారు. ఏరియాలవారీగా కలెక్షన్ల వివరాలు గమనిస్తే... నైజాం - 4.70 కోట్లు, సీడెడ్ - 2.20, ఉత్తరాంధ్ర - 1.90, గుంటూరు- 1.45 కోట్లు రాబట్టింది. కర్ణాటకలో 2 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 0.20 కోట్లు, ఓవర్సీస్- 0.75 కోట్లు రాబట్టింది. దీంతో భారీ అంచనాల మధ్య రిలీజైన గోవిందుడు మూవీ మొదట్లో బాగానే వసూళ్లు రాబట్టుకున్నా... తర్వాత ‘‘లౌఖ్యం’’ వల్ల పూర్తిగా తగ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  hero gopichand  govindudu andarivadele  loukyam movie  tollywood news  

Other Articles