Actor prakash raj controversial comments on director srinu vaitla

prakash raj latest news, director srinu vaitla latest news, prakash raj news, srinu vaitla news, prakash raj srinu vaitla fight, aagadu movie news, aagadu movie villain character, aagadu movie flop, aagadu movie collections

actor prakash raj controversial comments on director srinu vaitla

మళ్లీ మొదలైన ప్రకాష్ రాజ్, శ్రీనువైట్ల గొడవ!

Posted: 10/04/2014 04:44 PM IST
Actor prakash raj controversial comments on director srinu vaitla

‘‘ఆగడు’’ సినిమాను తెరకెక్కించే నేపథ్యంలో దర్శకుడు శ్రీనువైట్ల, ప్రకాష్ రాజ్ ల మధ్య జరిగిన వివాదం సంగతి అందిరికీ తెలిసిందే! కొన్నాళ్లవరకు వాళ్లిద్దరి మధ్య సాగిన వివాదం ఒకానొక దశలో ఫుల్ స్టాప్ పడిపోయింది. దాంతో వారిమధ్య ఎటువంటి విభేదాలు లేవని అందరూ అనుకున్నారు. కానీ తాజా పరిణామాల ప్రకారం చూస్తే.. వీరిద్దరి మధ్య ఇంకా ఆ గొడవ పూర్తిగా సద్దుమణిగినట్లు లేదని తెలుస్తోంది. తాజాగా ప్రకాష్ రాజ్ దర్శకుడు శ్రీనువైట్ల మీద శనివారంనాడు ఫైర్ అయ్యాడు. శ్రీనుకి ఒకవైపు సలహాలు ఇస్తూనే పరోక్షంగా తిట్టేశాడు ప్రకాష్! మొత్తం మేటర్ అర్థం కావాలంటే ఒక్కసారి గతంలోకి వెళ్లాల్సిందే!

‘‘ఆగడు’’ సినిమాను ఇంకా తెరకెక్కించకముందు దర్శకుడు శ్రీనువైట్ల తొలుత విలన్ గా ప్రకాష్ రాజ్ ను తీసుకున్నాడు. రెండురోజులవరకు షూటింగ్ కు కూడా హాజరయ్యాడు. అయితే షూటింగ్ నేపథ్యంలో ప్రకాష్ కో-డైరెక్టర్ ని దూషించడంతో ఆయన్ను తప్పించి సోనూసూద్ ని తీసుకున్నాడు. కేవలం కో-డైరెక్టర్ నే కాదు.. సెట్ లో వున్న వారందరిపై ప్రకాష్ రాజ్ అనవసరంగా కోపగించుకునేవాడని, అందుకే అతన్ని చిత్రం నుంచి తీసేశామంటూ దర్శకుడు శ్రీను కూడా పేర్కొన్నాడు. అయితే ఈ విషయమై ప్రకాష్ ప్రెస్ మీట్ పెట్టడంతో వారిద్దరి మధ్య వివాదం చివరకు ఫిల్మ్ ఛాంబర్ కి చేరిపోయింది. ఆ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ ను బ్యాన్ చేయడం ఖాయమంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరకు ఎలాగోలా వారిమధ్య వివాదం సద్దుమణగడం, తీసుకున్న అడ్వాన్స్ ను ప్రకాష్ వెనక్కి తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో మేటర్ అక్కడితో ఆగిపోయింది.

ప్రస్తుతానికి వస్తే.. ‘‘ఆగడు’’ మూవీ రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో ప్రకాష్ రాజ్ మరో వివాదంతో మళ్లీ తెరముందుకు వచ్చాడు. తాను ఆనాడు ‘‘ఆగడు’’ సినిమా షూటింగ్ సందర్భంలో చెప్పిన కొన్ని మాటలను సినిమాలోని విలన్ క్యారెక్టర్ తో దర్శకుడు శ్రీనువైట్ల చెప్పించడంపై మండిపడ్డాడు. వైట్ల ఆ మాటలను తన సినిమాలో వాడుకుంటున్నానంటూ ఫోన్ చేసి చెప్పి వుండే బాగుండేదని చెప్పుకొచ్చిన ప్రకాష్.. వైట్లకు అహంకారం చాలా ఎక్కువేనంటూ వ్యాఖ్యలు చేశాడు. అలాగే నేను దర్శకుడు అనుకోవడం వేరు.. నేను దర్శకుడ్ని అనుకోవడం అహంకారపూరితమని, వైట్ల ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి మారితే మంచిదంటూ సలహా కూడా ఇచ్చాడు. అంటే.. వైట్ల అహంకారంతో సినిమాను తెరకెక్కించడంతోనే సినిమా బోల్తాపడిందంటూ ప్రకాష్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అంతా బాగానే వుంది కానీ.. ఇదివరకే ఎన్నో వివాదాస్పదాల నుంచి బయటపడి వచ్చిన ప్రకాష్.. ఇప్పుడు ఈ తాజా వివాదం అతనిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెడుతుందోనంటూ సినీఫక్కీలో చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakash raj  aagadu movie  director srinu vaitla  villain character  tollywood news  

Other Articles