Ram gopal varma latest movie savitri first look creates controversial

ram gopal varma, savitri movie, savitri movie first look, ram gopal varma news, ram gopal varma savitri movie, adult teachers, adult movies, ram gopal varma adult movies, saraswathi teacher, ram gopal varma saraswathi teacher

ram gopal varma latest movie savitri first look creates controversial

తన హాట్ ఇంగ్లీష్ టీచర్ కథను ‘‘సావిత్రి’’గా తీస్తున్న వర్మ!

Posted: 10/04/2014 10:54 AM IST
Ram gopal varma latest movie savitri first look creates controversial

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలు దాదాపు అన్నీ రియాలిటీతో కూడుకున్నవే వుంటాయి. అంటే.. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి, సినిమాలుగా తీయడం ఆయనకు అలవాటు! అటువంటి చిత్రాలు తీయడం వల్లే ఆయన వివాదాస్పదంగా మారాడని అందరూ అంటుంటారు. అది వేరే విషయంలెండి! తాజాగా వర్మ ఈసారి తన జీవితంలో జరిగిన ఒక అనూహ్యమైన కథను తెరకెక్కిస్తున్నట్లు స్వయంగా ప్రకటించాడు. ఇప్పటికే ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా విడుదలై, ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

తనకు ఓ టీచర్ పట్ల ఆకర్షణ కలిగిందనీ, ఆ సంఘటనలనే కథగా మార్చి ‘‘సావిత్రి’’ సినిమాగా రూపొందిస్తున్నానని ఆయన ప్రకటించాడు. ఇంకా తన చిత్రానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతి టీనేజర్ జీవితంలో ఎవరో ఒక సావిత్రి ఖచ్చితంగా వుంటుంది. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో మా ఇంగ్లీష్ టీచర్ సరస్వతి అంటే నాకు పిచ్చెక్కిపోయేది. ఆమె అందాలు, హావభావాలు నా మతిని పోగొట్టేవి. ఆ సరస్వతే నా సావిత్రి. అలాగే ఇతర జీవితాల్లో కూడా ఇలాంటి సావిత్రులు వుంటారు. అలాంటి సావిత్రి కథనే తెరమీదకెక్కిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు వర్మ!

ఈయన అన్నట్లు అందరి జీవితాల్లో ఇలా సావిత్రి రూపంలో హాట్ టీచర్లు వుంటారో లేదో తెలియదు కానీ... ఈయన కూడా చిన్నప్పటినుంచే మంచి రసికుడని నిరూపించుకున్నాడు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఇటువంటి సినిమాలు తీయడం వల్ల పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని, చాలా త్వరగా పిల్లలు చెడిపోతారని కొంతమంది విశ్లేషకుల వాదన! ఇవన్నీ పక్కనపెడితే.. వర్మ టీచర్ కథ చెప్పి, ఇప్పటినుంచే ఖర్చులేకుండా బాగా పబ్లిసిటీ చేయించుకుంటున్నాడు. మరి ఈ సినిమామీద ఎలాంటి వివాదాలు తెరమీదికొస్తాయో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  savitri movie  adult movies  saraswathi english teacher  tollywood  

Other Articles