Mahesh babu may become as andhrapradesh brand ambassadr

mahesh babu, mahesh babu wiki, mahesh babu latest, mahesh babu brand ambassador companies, mahesh babu advertisements, mahesh babu family, mahesh babu movies, mahesh babu daughter, mahesh babu son, mahesh babu andhrapradesh brand ambassador, andhrapradesh brand ambassador, latest news, andhrapradesh, telangana, telugu news, tollywood, ads, galla jayadev, galla aruna, amithab bachan, mohan lal, akshay kumar, sania mirza

rumors that telugu super star mahesh babu name is considering for andhrapradesh government brand ambassador : prince mahesh babu is ready to become brand ambassador for andhrapradesh

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్...?

Posted: 09/26/2014 10:50 AM IST
Mahesh babu may become as andhrapradesh brand ambassadr

ప్రిన్స్ మహేష్ మరో ఆఫర్ కొట్టేశాడు. ఇప్పటికే యాడ్లు, బ్రాండ్ అంబాసిడర్ హోదాలతో సినిమాలతో సమానంగా బయట కూడా సంపాదిస్తున్న మహేష్ మరో భాద్యతను కూడా భుజాలపై వేసుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి సానియా మిర్జాను అంబాసిడర్ గా ప్రకటించటంతో.., దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు.

ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, మహేష్ కుటుంబానికి సన్నిహితుడు అయిన గల్లా జయదేవ్ ఈ మేరకు ప్రభుత్వానికి సూచించటంతో పాటు.., అనుకూలంగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈయనకు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సహకరిస్తున్నారు. ఇద్దరు బాబుల మద్య మీడియేటర్ గా ఉండి.., మహేష్ బ్రాండ్ ను ఏపీకి తీసుకురావటంకోసం జయదేవ్ కష్టపడుతున్నాడు.

సినిమా హీరోలు రాష్ర్టాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండటం కొత్తేమి కాదు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.., గుజరాత్ రాష్ర్ట బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అటు కేరళకు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, ఢిల్లీకి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బ్రాండు అంబాసిడర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి పాపులర్ హీరో మహేష్ బ్రాండ్ అంబాసిడర్ అవుతారని తెలుస్తోంది. ఇందుకు పాపులారిటీతో పాటు, అధికార పక్షంలో బలంగా ఉండే సామాజిక వర్గ సమీకరణాలు కూడా ఆయనకు మరింత సహకారం అందిస్తున్నాయని చెప్పవచ్చు.

తెలుగు హీరోల్లో ఎక్కువ యాడ్లు చేసే వ్యక్తిగా మహేష్ కు రికార్డు ఉంది. ఒకప్పుడు చిరంజీవికి ఈ పేరు ఉండగా.., దాన్ని మహేష్ ఆక్రమించాడు. కూల్ డ్రింక్స్, బైక్స్, డ్రెస్సులు, నూనె, మొబైల్స్ ఇలా ఒకటేమిటి ఎన్నో కంపనీలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సినిమాలతో పాటుగా.., యాడ్లను చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న ప్రిన్స్ కు ఈ అవకాశం రావటం పట్ల ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమాన నటుడు ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. పోస్టర్లు కట్టే పనిలో ఫ్యాన్స్ ఇప్పుడు బిజీగా ఉన్నారు.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  andhrapradesh  brand ambassador  latest news  

Other Articles