I movie shooting completed

i movie, i movie songs, i movie latest updates, i movie release date, i movie release suspense, i movie songs free download, i movie shooting, shankar, director shankar, i movie audio launch, i movie vikram, vikram wiki, vikram in i movie, i movie trailor, i movie stills, amy jackson, amy jackson hot, amy jackson nude, amy jackson latest, i movie telugu, manoharudu, tollywood, koliwood, latest news

shankar's movie i shooting is completed after two and half years regular shooting : i team cuts cake for successfully completing film shooting now plans to work on post production

‘ఐ’ పని అయిపోయింది.. ఇంకేముంది..?

Posted: 09/25/2014 12:42 PM IST
I movie shooting completed

ఇండియన్ ఫిల్మ ఇండస్ర్టీలలో ఇప్పుడు ‘ఐ’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఎవరి నోట విన్నా ఈ సినిమా అప్ డేట్స్ ఉంటున్నాయి. కాని ఇప్పుడు ఓ కొత్త వార్త తెలిసింది. ఐ సినిమా ఒక పని పూర్తి చేసుకుంది. ముఖ్యమైన షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. రెండున్నర సంవత్సరాల పాటు కష్టపడి తీసిన సినిమా షూటింగ్ నిర్ణీత గడువులో పూర్తి కావటం పట్ల సినిమా యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. షూటింగ్ పూర్తి కాగానే., కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. డైరెక్టర్ శంకర్, హీరో విక్రమ్, నటి అమీ జాక్సన్ కలిసి కేక్ కట్ చేశారు. ఇన్నాళ్ళ కష్టం నేటితో పూర్తయింది అని అంతా అనుకున్నారు.

సినిమా షూటింగ్ పూర్తి కావటంతో.., ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం రష్ వెళ్తోంది. అయితే గ్రాఫిక్స్, విజువల్ వండర్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో ఇంకా చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న అక్టోబర్ 23(దీపావళి)కి సినిమా విడుదల కాకపోవచ్చు అని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా దీపావళి రోజున బయటకు వస్తుందని ఐ యూనిట్ చెప్తోంది. అవసరమైతే అదనపు గంటలు పని చేసయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తామని అంటున్నారు.

180 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘ఐ’ సినిమా ఓ విజువల్ వండర్ గా నిలవటంతో పాటు.., రికార్డులు కొల్లగొడుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నిటికీ సమాధానం చెప్పేలా ఇది ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ యాక్షన్ అద్బుతంగా ఉందని కితాబిస్తున్నారు. కేవలం ట్రైలర్ చూసి ఈ సినిమాను రూ.102కోట్లకు డిస్ర్టిబ్యూటర్లు కొనేందుకు ముందుకు వచ్చారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఐ’ సినిమాకు ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఏ.ఆర్. రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో విడుదలైన పాటలు చెన్నై తీరాన హల్ చల్ చేస్తుండగా.., తెలుగులో జాకీచాన్ పాటలను విడుదల చేస్తారని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  shankar  vikram  latest news  

Other Articles